కాళ్లు, పాదాలు వాపుకి కారణాలు ఇవే?

ఇక చాలా మంది గంటలు గంటలు కూర్చొని అదే పనిగా ఆఫీస్ కి సంబంధించిన పని చేస్తుంటారు. దాని కారణంగా కాళ్లు, పాదాలు వాపు వస్తుంది. కూర్చోవడం వల్ల వచ్చే వాపు సాధారణ సమస్యగా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.అయితే, ఈ వాపు అనేక కారణాల వల్ల కూడా వస్తుందట. అలాంటి సందర్భంలో కారణం తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. లేదంటే ఆరోగ్య సమస్యలు మరింత ముదిరే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. పాదాల వాపునకు కారణాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.గర్భధారణ కూడా పాదాల వాపునకు ఒక సాధారణ కారణం.



శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాకుండా గర్బధారణ సమయంలో తక్కువగా నడవడం, తక్కువ శారీరక కదలికల వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది.గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి కారణంగా శరీరంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరకుపోతాయి. ఈ ద్రవాలు గురుత్వాకర్షణ వల్ల పాదాల్లోకి ప్రవేశిస్తాయి. అలా పాదాల్లో పేరుకుపోయి వాపు రావడానికి కారణం అవుతుంది.నరాల సమస్య కారణంగా కూడా కాళ్లలో వాపు వస్తుంది. పాదాలలోని చిన్న నరాలు సరిగా పని చేయకపోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. ఇది డిపెండెంట్ ఎడెమాకు పోలిక ఉంది.కాలిలోని సిరలు గురత్వాకర్షణకు వ్యతిరేకంగా పని చేస్తాయి.


ఈ కారణంగా సిరల లోపల కవాటాలు సరిగా పని చేయదు. రక్త సరఫరా జరగదు. ఫలితంగా పాదంలో ఒకరకమైన ద్రవాలు చేరడం వల్ల వాపు వస్తుంది.ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సాధారణ సమస్యలలో పాదాల వాపు ఒకటి. ఇది ఏ వయస్సు వారికైనా వస్తుంది. కూర్చున్న సమయంలో కాళ్లకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల అలా వాపు వస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి ఎక్కువ సేపు కూర్చోడం మానుకోండి. మామూలుగా ఇంట్లో అయిన కాసేపు అటు ఇటు నడవడం అలవాటు చేసుకోండి. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి రోజూ కాసేపు నడవండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: