మన పూర్వకాలంలో ఎక్కడ చూసినా కూడా వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. అయితే ఈరోజుల్లో వేప మొక్కలు  చూద్దామన్నా కనిపించడం లేదు. ఊరికి కనీసం ఒక వేప చెట్టు అయినా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.ఎందుకంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలు చాలా అద్భుతమైనవి. అందుకే వేప చెట్టును తప్పనిసరిగా ఇళ్లలో పెంచుకునేవారు. అయితే ఇప్పుడు కేవలం ఇవి మనకు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి.కానీ వేప చెట్టు కనిపస్తే ఇకపై దాన్ని అస్సలు విడిచిపెట్టకండి. ఎందుకంటే వేపాకుతో ఎన్నో వ్యాధులను ఈజీగా నయం చేసుకోవచ్చు. ఇక అందులో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.వేప చెట్టు ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను మెత్తగా నూరి కట్టు కడుతుంటే చాలా కాలంగా మానని మొండి గాయాలు, పుండ్లు ఇంకా కురుపులు కూడా ఈజీగా మానిపోతాయి. ఈ వేపాకుల్లో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల గాయాలు ఇంకా పుండ్లు త్వరగా మానిపోతాయి. ఇంకా అలాగే ఈ వేప చిగుళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి.


ఆ తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. రోజు ఇలా తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది.అలాగే మన శరీరంపై ఉండే నల్లని మచ్చలు పోతాయి. ఇంకా చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.ఈ వేప చిగుళ్లను ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే తింటుంటే కొంత కాలానికి అవి చేదుగా కాక తియ్యగా మీకు అనిపిస్తాయి.ఇంకా వారికి పాము కరిచినా విషం ఎక్కదు.వేప చెక్క గంధాన్ని శరీరంపై రాసుకుంటుంటే చర్మంపై వచ్చే చర్మ వ్యాధులు ఈజీగా తగ్గిపోతాయి. అలాగే శరీరం పేలినట్లు ఉండడం, దురదలు, శోభి, మంగు, తామర ఇంకా గజ్జి వంటి చర్మ వ్యాధులు ఈజీగా తగ్గిపోతాయి. అలాగే ముదురు వేప చెట్టు వేరు చూర్ణం కొద్ది మోతాదుగా లోపలికి తీసుకుంటుంటే రక్తం బాగా శుభ్రంగా మారుతుంది. అలాగే శరీరానికి పుష్టి కలిగిస్తుంది. జ్వరం కూడా తగ్గుతుంది.క్రిములు ఈజీగా నాశనం అయిపోతాయి. దీంతో విష జ్వరాలు కూడా ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: