అధిక బరువుతో బాధ పడేవారికి వెల్లుల్లి చాలా విధాలుగా మేలు చేస్తుంది.స్నాక్స్, బ్రెడ్, టోస్ట్ వంటి వాటిని అవకాడోతో తయారు చేసిన డిప్ లో తినేముందు దీనిలో వెల్లుల్లి చేర్చుకోని తినడం వల్ల రుచితో పాటు బరువు కూడా చాలా ఈజీగా తగ్గవచ్చు. ఇంకా అలాగే ఉదయం పూట కొందరు కోడిగుడ్లతో బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. దీనిలో కూడా వెల్లుల్లి వేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.తీసుకునే ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అందువల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు.స్మూతిలు తాగడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మనం తాగే స్మూతీలలో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెమ్మలను వేసి తయారు చేసి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఇలా స్మూతీలలో వెల్లుల్లి వేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా మం వెల్లుల్లితో వెల్లుల్లి లెమన్ టీని కూడా తయారు చేసి తీసుకోవచ్చు.


ఈ టీని రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది.అలాగే మనం పొద్దున సాయంత్రం వేళల్లో టిఫిన్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా చట్నీ అవసరం. అందులో భాగంగా వెల్లుల్లి చట్నీని తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.వెల్లుల్లి, మిరపకాయలు కలిపి ఎక్కువ క్యాలరీలు చేరకుండా చట్నీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చు. దీనిని మనం భోజనంలో కూడా తినవచ్చు.అలాగే కాల్చిన కూరగాయలను బేకింగ్ చేయడానికి ముందు వాటిపై వెల్లుల్లి తురుమును వేసి బేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల రుచి పెరగడంతో పాటుగా మనం బరువు కూడా తగ్గవచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారు వెల్లుల్లి రెబ్బలను నేరుగా నోట్లో వేసుకుని నమలవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఆ నీటిని తాగుతూ వెల్లుల్లి రెబ్బలను నమలవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. మనం సులభంగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: