
చూడటానికి చిన్నగా, నార్మల్‌గా కనిపించే నువ్వుల్లో మన బాడీకి కావాల్సినన్ని పోషకాలున్నాయి .. అసలు వీటిని తింటే ఏం జరుగుతుందో ?తెలుసుకుందాం. నువ్వులు ... చిన్నగా , నార్మల్‌గా అనిపించినా , వీటిలో మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలున్నాయి. మన ఎముకలు బలంగా ఉండాలన్నా , రోగనిరోధక శక్తి పెరగాలన్నా , చర్మం మెరిసిపోవాలన్నా , జుట్టు ఒత్తుగా పెరగాలన్నా , గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా , టెన్షన్ తగ్గాలన్నా ... అన్నిటికీ నువ్వులు పనికొస్తాయి. నువ్వుల్లో దాగి ఉన్న గుణాలు చూద్దాం ..
* మన బాడీ లో రోగాలతో పోరాడే శక్తిని పెంచుతాయి. నువ్వు లతో రోగ నిరోధక శక్తి బాడీ లో పెరగంతో పాటు ఎనర్జిటిక్ గా ఉంటాము. నువ్వు లతో తయారు చేసిన పదార్థాలు మానవ శరీరాన్ని ఎంతో బలిష్టంగా తయారు చేస్తాయి ..
* ఎముకల్ని గట్టిగా చేస్తాయి, దీంతో ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది. ఎముకల పుష్టి కోసం నువ్వు లతో తయారు చేసిన పదార్థాలు ఎంతో ఉపకరిస్తాయి.
* శరీరంలో నొప్పి , వాపుల్ని తగ్గిస్తాయి.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్దకం రాకుండా చూస్తాయి. దీని వల్ల శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
* చర్మం పొడిబారకుండా , ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి ..
* జుట్టు రాలకుండా , ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
* గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
* టెన్షన్ , ఒత్తిడిని తగ్గిస్తాయి .. అంతేకాదు , మన పళ్లకి కూడా బలాన్నిస్తాయి.
* అందుకే రోజు కాస్త నువ్వులు తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ , ఏదైనా ఎక్కువ తింటే ప్రమాదమే కదా , అందుకే మోతాదు మించకుండా తినాలి.