ఈ రోజుల్లో చిన్న చిన్న అనారోగ్యాలకూ టాబ్లెట్లు తీసుకోవడం మనకు అలవాటైపోయింది. దీని ప్రభావంతో మన శరీరంలోని సహజ రోగనిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీ పవర్, తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆయుర్వేద సంపదలో భాగమైన వాము ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.

ఇంట్లో సర్వసాధారణంగా లభించే వాము, ఓ ప్రత్యేకమైన ఘాటు వాసన కలిగి ఉంటుంది. కాస్త చేదుగా ఉన్నా ఆరోగ్య పరంగా ఎంతో శ్రేయస్కరం. కర్రీలలో, చట్నీలలో తరచూ ఉపయోగించే ఈ వాము ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది.ఆహారం తిన్న తర్వాత అది జీర్ణం కాకపోతే, లేదా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కలిగితే వాము కలిపిన భోజనం తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. రోజూ ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ అల్లం పొడి నీళ్లలో కలిపి తాగితే చాతిలో మంటలు, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ముక్కు దిబ్బడ, శ్వాస సంబంధిత ఇబ్బందులను కూడా ఇది తగ్గిస్తుంది.

వాము, బెల్లం కలిసి వేడి చేసి తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు వాము పొడిని చిన్న గుడ్డలో కట్టి పీల్చితే తలనొప్పి తగ్గుతుంది.  జుట్టు తెల్లబడటం, రాలడం, చుండ్రు వంటి సమస్యలకు వాము, కరివేపాకు, ఎండు ద్రాక్ష, చక్కెర కలిపి ఒక కప్పు నీటిలో ఉడికించి ఆ నీటిని రోజూ త్రాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంటి చుట్టూ దోమలు రాకుండా ఉండాలంటే ఆవనూనెలో వాము పొడి కలిపి కిటికీలకు, తలుపుల దగ్గర, మూలల వద్ద రాస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో మంచి సువాసన కూడా కలుగుతుంది.


చర్మంపై మొటిమలు, మచ్చలు ఉన్నప్పుడు వాము పొడిని నీటితో పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి, మంట లేదా దురద ఉంటే అక్కడ వాము పేస్ట్ రాసి కొంతసేపటికి కడిగితే ఉపశమనం లభిస్తుంది. సహజమైన ఔషధ గుణాలతో నిండిన వాము మన ఆరోగ్యాన్ని రక్షించడంలో విశేష పాత్ర పోషించగలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: