మన చుట్టూ చూస్తుంటే చాలామంది “బరువు తగ్గాలి” అనే లక్ష్యంతో రాత్రిపూట భోజనం చేయకుండా ఉంటారు. “అన్నం తింటే బరువు పెరుగుతాము”, “రాత్రి పూట అన్నం తింటే ఫ్యాట్ బాడీలో నిలుస్తుంది” అని అనుకుంటూ చాలామంది కడుపు మాడ్చుకుని నిద్రపోతారు. కొందరు ఆకలిగా ఉన్నా, కేవలం నీళ్లు తాగి కడుపు నింపేసుకుని పడుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు అని డాక్టర్లు చెబుతున్నారు. అసలు నిజం ఏమిటంటే — రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగదు, తినే విధానం, మోతాదు, టైమింగ్ — ఇవే ప్రధాన కారణాలు. మనం ఎప్పుడు తింటామో, ఎంత తింటామో, ఎలా తింటామో అనే విషయాల మీదే మన బరువు ఆధారపడి ఉంటుంది. చాలామందికి “రాత్రి అన్నం తింటే నిద్ర బాగా వస్తుంది” అని చెబుతారు. ఇది నిజమే. ఎందుకంటే, బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరంలో ‘సెరటోనిన్’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయట. అది నిద్రను ప్రోత్సహిస్తుందట. కానీ అన్నం తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది.


"రాత్రిపూట అన్నం తిన్నోచ్చా..??” అంటే డాక్టర్లు చెబుతున్న సమాధానం "తినొచ్చు". “అవును, కానీ స్మార్ట్‌గా తినాలి.” వాళ్లు సూచిస్తున్న పద్ధతి చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అన్నం వండే ముందు బియ్యం బాగా కడిగి, ఆ నీటిని పారబోసేయాలి. బియ్యం కడిగిన నీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని తొలగించడం ద్వారా స్టార్చ్ కొంచెం తగ్గుతుంది. రైస్ కుక్కర్‌లో కాకుండా గిన్నెలో ఉడకబెట్టాలి. ఇలా వండినప్పుడు వచ్చే గంజిని వంచేసి పారేయాలి. దాంతో రైస్‌లోని అదనపు స్టార్చ్ కూడా తగ్గిపోతుంది. తిన్న వెంటనే పడుకోవడం కాదు తిన్న తర్వాత కనీసం 15–20 నిమిషాలు ఇంట్లోనైనా నడవాలి లేదా చిన్న వాకింగ్ చేయాలి. ఇది జీర్ణక్రియకు చాలా హెల్ప్ చేస్తుంది.



తిన్న తర్వాత గోరువెచ్చని నీటిలో జీలకర్ర వేసి తాగాలి. లేదా జీలకర్ర పొడి కలిపిన నీటిని తాగినా బాగుంటుంది. ఇది గ్యాస్, బ్లోటింగ్, ఇన్‌డైజెషన్ తగ్గిస్తుంది, ఫ్యాట్ నిలవకుండా చేస్తుంది. తినే సమయానికి కూడా ప్రాముఖ్యత ఉంది. రాత్రి నిద్రపోయే సమయానికి కనీసం 3–4 గంటల ముందే అన్నం తినడం మంచిది. అంతవరకు ఆహారం పూర్తిగా జీర్ణమైపోతుంది. డాక్టర్ల ప్రకారం, ఈ విధానం పాటిస్తే రాత్రిపూట అన్నం తిన్నా బరువు పెరగరు  — శరీరానికి కావలసిన ఎనర్జీ కూడా లభిస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి, ఒబిసిటీ ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుందట . వారంలో కనీసం రెండు లేదా మూడు రోజులు ఇలా చేసినా శరీరంలో తేలికగా, రిలాక్స్‌గా అనిపిస్తుంది.



నిద్ర లేకుండా బరువు తగ్గడం అసాధ్యం. నిద్ర సరైన స్థాయిలో లేకపోతే, శరీరం “స్ట్రెస్ హార్మోన్స్” విడుదల చేస్తుంది, అవి తిరిగి ఫ్యాట్ నిల్వను పెంచుతాయి. కాబట్టి “అన్నం తింటే నిద్ర బాగా వస్తుంది” అనే వాళ్ళు  భయపడకండి. తినే విధానం మార్చితే చాలు. రాత్రిపూట అన్నం తినడం పాపం కాదు, తినే పద్ధతి తప్పు అయితేనే సమస్య. కడుపు మాడ్చుకునే బదులు — సైన్స్‌కి అనుగుణంగా తినడం నేర్చుకుంటే, బరువు తగ్గడం కూడా ఆనందంగా మారుతుంది.



నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కొంత మంది డాక్టర్ల సలహాతో చెప్పబడింది. ఇది ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం అని గుర్తు ఉంచుకోండి. ఏదైన సలహా పాటించే ముంది మీ పరసనల్ డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: