తృణధాన్యాలను ఆహారంలో పిల్లలకు భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.అలగే పిల్లలకు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను పెట్టకపోవడం మంచిది. బాదం ( Badam ) , పిస్తా, జీడిపప్పు (Cashew ) తినడం వల్ల అందులో ఉండే పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు బలంగా మారుతారు. ఆరోగ్యంగా మారుతారు.పిల్లలని ఈ కాలంలో కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా చేయాలి. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి.అలాగే పిల్లలకు మాంసం, గుడ్లు పెట్టడం ఏమి ప్రమాదమేమీ కాదు. కానీ బాగా ఉడికించిన మాంసాన్నే తినిపించాలి.
అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.పిల్లల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి.నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
ఆకు కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దిరుకుతాయి దొరుకుతాయి.అందుకనే పైన తెలిపిన ఆహార పదార్ధాలను తరచూ పిల్లలకు పెడుతూ ఉండాలి.. !!
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి