
మీ గోడలను తిరిగి వాటి అసలు రంగుకు తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సూచనలు పాటించండి.ఒక బక్కెట్‌లో గోరువెచ్చని నీటిని నింపి, దానికి కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్ కలపండి. పరిశుభ్రమైన వాష్‌క్లాత్ తీసుకొని, ద్రావకంలో ముంచండి, అమితంగా ఉన్న నీటిని పిండేయండి. క్రేయాన్ రంగులను గోడల నుంచి సులభంగా శుభ్రం చేసేందుకు దీనిని ఉపయోగించండి. అలాగే గోడల్లో మరకలు పడిన ప్రాంతంపై కొద్దిగా గ్లాస్ క్లీనర్‌ని పిచికారి చేసి 20 నిమిషాల సేపు వదిలేయాలి. క్రేయాన్ గుర్తులను గ్లాస్ క్లీనర్ లూజు చేస్తుంది. గోడల నుంచి మరకలను శుభ్రం చేసేందుకు పరిశుభ్రమైన వాష్‌క్లాత్‌ని ఉపయోగించండి.
అలాగే మచ్చలు పోవడానికి మన ఇంట్లో మనమే తయారుచేసుకునే చిట్కా ఇది. ఒక గిన్నెలో కొంచెం బేకింగ్ సోడా, నీళ్ళు 1 కప్పు చొప్పున తీసుకొని పేస్టు తయారు చేయండి. స్పాంజిని మిశ్రమంలో ముంచండి. క్రేయాన్ మరకలను పోగొట్టేందుకు గోడలపై పేస్టు పూయండి. ఈ ప్రక్రియ వల్ల కొద్దిగా అవశేషం ఉండిపోతుంది, సబ్బు నీటితో దీనిని శుభ్రం చేయవచ్చు. అయితే, ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని నిర్థారించుకునేందుకు, మొదటగా మీ గోడపై చిన్న ప్యాచ్‌పై, ప్రత్యేకించి దాగివున్న మూలలో వాటిని ప్రయత్నించవలసిందిగా మేము సూచిస్తున్నాము.అయితే పిల్లలు అంటే పిల్లలే, వాళ్ళ చేష్టలు కూడా అలాగే ఉంటాయి.వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అన్న విషయం తెలియదు. తెలియక చేసిన తప్పును మన్నించండి.. అంతేకాని పిల్లలను కొట్టడం, తిట్టడం లాంటివి చేయకండి.. !!