పిల్లలు చిరు ధాన్యాలు పెట్టడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఒక్కసారి చూద్దమా. చిరు ధాన్యాలు అయ్యినటువంటి రాగులు, సజ్జలు, కొర్రలను ఎక్కువగా వాడుతున్నప్పటికీ మనకు సరిగ్గా లేదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా.. జొన్నలు, రాగులు, కొన్ని ప్రాంతాల్లో సజ్జలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఇక చిరు ధాన్యాల్లో పొట్టు తీసినా, కాస్త కొవ్వు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. దీనిలో మంచి కొవ్వు, చికు -ధాన్యాలు షుగర్ పేషంట్లకు ఒక బలం లాంటివి అని అంటున్నారు. అయితే ధాన్యాల్లో ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కావునా వీటిలోని గ్లూకోజ్ కూడా వర్తంలో కలుస్తుందని తెలిపారు.

అయితే చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను నములుతూ తినడానికి కాస్త ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తీసుకునే ఆహార పరిమాణం సైతం తగ్గుతుందని పేర్కొన్నారు. అంతేకాక.. ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇక ఇలా బరువు తగ్గటానికి దోహదపడుతాయి. ఇక రక్తంలో కొలెస్టాల్ శాతం అదుపులో ఉంచుతుంది.

అంతేకాక.. చిరుధాన్యాలు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గడానికి సహాయపడుతుంది. దాంతో కడుపులో ఇబ్బంది అల్సర్ల వంటివి తలెత్తకుండా ఉంటాయి. ఇక వీటితో కాల్షియం, జనుము లభించడంతో పాటు మలబద్దకం కూడా దూరం అవుతుందని తెలిపారు. అయితే ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణ లోపాన్ని దూరంగా ఉంచొచ్చునని చెబుతున్నారు.ఇక వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చునన్నారు. అయితే రాగులతో పొడి చేసిన పిండిని ఉదయం మజ్జిగతో గాని బెల్లంతో గాని తీసుకొంటే అద్భుతమైన పోషకాలు పొందవచ్చునని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: