ప్రతి ఒక్కరు సీజన్లో దొరికేటువంటి పండ్లను క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. ఇలా దొరికేటువంటి పండ్ల ను తినడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సీజన్ లో దొరికేటువంటి పండ్లలలో సపోటా కూడా ఒకటి. సపోటా ఉష్ణ మండల ప్రాంతాలలో బాగా ఎక్కువగా పెరుగుతాయి. ఈ కాయలలోని గుజ్జు తినడం చాలా రుచిగా ఉంటుంది . తినడానికి ఎక్కువగా మృదువుగా ఉంటుందని చెప్పవచ్చు.

కాయ మాగినప్పుడు గుజ్జుభాగం పండినప్పుడు బాగా మెత్తగా అవుతుంది. సపోటాను ఎక్కువగా చిక్కు అని పిలుస్తూ ఉంటారు. సపోటా పండు గురించి తెలియని వారికి కొన్ని విషయాలు ఉన్నాయి.. సపోటా వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా సపోటాలో ఎక్కువగా గ్లూకోజ్ అధికంగా ఉండడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తిని కలిగిస్తుంది. ఈ పండ్లలో విటమిన్స్, మినరల్స్ చాలా సమృద్ధిగా లభిస్తాయి. దీనివల్ల రుచికి తీయగా ఉండడం వల్ల తినడానికి రుచికరంగా ఉంటాయి.

సపోటాలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల కంటిచూపు కూడా సమృద్ధిగా కనిపిస్తుంది. వయసు రీత్యా వచ్చే సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది సపోటా. సపోటాలు గ్లూకోస్ ఉండడం వల్ల వీటిని ఎక్కువగా క్రీడాకారులు తినడం మంచిది. సపోటాలు యాంటీ ఇంప్లమెంటరీ ఏజెంట్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు.

ఇక ఇది ఎలాంటి వాపునైనా.. నొప్పునైనా తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. సపోటాలలో క్యాల్షియం, ఐరన్ , ఫాస్పరస్ చాలా సమృద్ధిగా లభిస్తాయి. దీంతో ఎముకలు చాలా దృఢత్వంగా మారుతాయి. సపోటాలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ క్రియ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది.మలబద్ధక సమస్యతో బాధపడేవారు వీటిని తినడం చాలా మంచిది. పాలిచ్చే తల్లులకు కూడా ఇది చాలా రకంగా ఉపయోగపడుతుందట. ఇక ఇవే కాకుండా పలు రకాల ఉపయోగాలు సపోటా పండ్లలో ఉంటాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: