ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏమిటంటే .. హీరోయిన్ కృతి శెట్టి కూడా సమంత రూట్లోనే వెళ్తుందా? అనే చర్చ. ఇండస్ట్రీ వర్గాల మధ్య, అభిమానుల మధ్య ఇదే టాపిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. హీరోయిన్ సమంత తన కెరీర్‌లో టాప్ స్థాయిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత జీవితంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కి గురయ్యారు. అలాంటి కఠిన సమయాల్లో కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. అదే సమయంలో “పుష్ప” సినిమాలోని స్పెషల్ సాంగ్ ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడం ఆ సమయంలో పెద్ద సంచలనంగా మారింది. కొంతమంది విమర్శించినా, చాలా మంది ఆమె ధైర్యాన్ని, ప్రొఫెషనలిజాన్ని ప్రశంసించారు. “ఊ అంటావా మావా” పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియా హీటెక్కింది. ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో, రీల్స్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. దానికి ప్రధాన కారణం సమంత వేసిన హాట్ అండ్ గ్రేస్‌ఫుల్ స్టెప్స్‌నే అని చెప్పాలి.


ఇప్పుడు అదే తరహా చర్చ హీరోయిన్  కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, కృతి శెట్టి కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లుగా ఆమె దగ్గరకు వచ్చిన ఐటమ్ సాంగ్ ఆఫర్లను నిరాకరిస్తూ వచ్చిందట. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. “రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఎదగడం కష్టమే. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలంటే, కొత్త ప్రయోగాలు చేయాలి,” అని ఆమె దగ్గరి వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.



ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నట్లుగా, కృతి శెట్టి త్వరలోనే ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసే అవకాశం ఉంది. ఆ పాట ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆ సాంగ్ కోసం ఆమె సుమారు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ఇండస్ట్రీ టాక్. ఒక హీరోయిన్‌కు ఇంత భారీ పారితోషికం ఇవ్వడం అంటే, ఆ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.



దీని పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్స్ కురిపిస్తున్నారు . “కృతి ఇలా డెసిషన్ తీసుకుంటే, డబ్బు కూడా ఆమె అకౌంట్‌లో బాగా చేరుతుంది!” అని కొందరు వ్యంగ్యంగా చెబుతుండగా.. మరికొందరు “ఇది ఆమె కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.


ఏదేమైనా, కృతి శెట్టి సమంత రూట్లో వెళ్తుందా లేక తనదైన రూట్ క్రియేట్ చేసుకుంటుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి చర్చా విషయమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: