న‌డ‌క నాలుగు విధాలు మంచి అన్న‌ది నాటి మాట‌..కానీ పెరుగుతున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు నాలుగు విధాలుగా కాదు..ఏకంగా న‌ల‌బై రోగాల‌ను దూరం చేస్తుంద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. మారుతున్న ఉరుకులు ప‌రుగుల జీవితంలో క‌నీస వ్యాయామం చేయ‌క‌పోవ‌డం ఆరోగ్యానికి  చేటే చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. డాక్ట‌ర్లు చెబుతున్న దాని ప్ర‌కారం. ప్ర‌తీ ఒక్క‌రూ క‌నీసం 10వేల అడుగుల దూరమైనా న‌డ‌వాల‌ట‌. అయితే  ఇంత స‌మ‌యం కుద‌ర‌ని వారు కనీసం 5వేల అడుగులు అయినా నడవాలని చెబుతున్నారు. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ లాంటి దీర్ఘ‌కాలిక వ్యాధులు నియంత్ర‌ణ‌లో ఉండ‌ట‌మే కాకుండా న‌ల‌బై ఇత‌ర రోగాలు ద‌రి చేర‌వ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

 

వ్యాయామంతో శారీరానికి క‌నీస శ్ర‌మ ల‌భిస్తుంద‌ని..దీంతో చెడు కొవ్వు చెమట‌రూపంలో బ‌య‌ట‌కి వెళ్లిపోతుంద‌ని చెబుతున్నారు. ఇది అధిక బ‌రువును  క‌రిగించ‌డ‌మే కాకుండా శ‌రీరంలోని ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగ‌వంత‌మైన న‌లుమూలాల ఉన్న ర‌క్త క‌ణాల‌కు ఆక్సిజ‌న్ ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. కఠినతరమైన వ్యాయామాలు చేయలేని వారికి న‌డ‌క అనేది దివ్యాష‌ధంలా ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.  అయితే రోజూ న‌డ‌క‌ను వివిధ ర‌కాలుగా చేసే వారూ ఉంటారు. అయితే ఎంత‌న‌డిచామో ఇతిమిద్దంగా తెలుసుకోవ‌డానికి ఇప్పుడు మార్కెట్లో అధునాత‌న వ్యాయామ ప‌రిక‌రాలు అందుబాటులో ఉన్నాయి.

 

ఇందుకు ఇప్పుడు మార్కెట్‌లో పెడోమీటర్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఇది ప్ర‌త్యేకంగా కొన‌లేక‌పోయిన వారు  స్మార్ట్‌ఫోన్‌లో పెడోమీటర్ యాప్ వేసుకున్నా చాలు.. మీరు నడిచినప్పుడు మీ వెంట ఫోన్‌ను ఉంచుకోండి. అందులో పెడో మీటర్ యాప్‌ను ఆన్ చేస్తే చాలు మీరు రోజూ ఎంత న‌డ‌క సాగిస్తున్నారో అడుగుల‌తో లెక్క వేసి చెబుతుంది. అదీ కుదరక పోతే మనకు మార్కెట్‌లో ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయ‌ని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు.  ఇక మ‌నం చేయాల్సిద‌ల్లా రోజూ వ్యాయామం చేయాల‌నే నియ‌మాన్ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకోవ‌డ‌మే..

మరింత సమాచారం తెలుసుకోండి: