భారత దేశంలో వ్యాపారం కోసం అని వచ్చిన బ్రిటీష్ వారు తర్వాత ఇక్కడే తమ రాజ్యాన్ని స్థాపించి క్రూరమైన పాలన కొనసాగించారు.  బ్రిటీష్ వారి దురాగతాలకు ఎదురు తిరిగి రొమ్ము విరిచి పోరాటం చేశారు భారతీయులు.  శాంతి మార్గాన్ని గాంధీ ఎంచుకుంటే.. అహింసా వాదాన్ని సుభాష్ చంద్రబోస్, అల్లురి సీతారామరాజు, భగత్ సింగ్, అజాద్ చంద్రశేఖర్ లాంటి వారు ఎంచుకొని మొత్తానికి బ్రిటీష్ వారిని 1947 న తరిమేశారు. అయితే భారతీయులు చేసిన పోరాటంలో  జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టమైన సంఘటన. పంజాబీలకు ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాదిమందిని 1919 ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ ఆదేశాలతో కాల్పులు జరిపారు.  

 
 
 

జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. జలియన్ వల్లా బాగ్ 6 నుండి 7 ఎకరాల (28,000 మీ) విస్తీర్ణంలో ఉన్న ఒక ఉద్యానవనం, అన్ని వైపులా గోడలు, ఐదు ప్రవేశాలు ఉన్నాయి. 

 

ప్రవేశించడానికి, దళాలు మొదట ట్యాంక్ ద్వారా ప్రవేశ మార్గాన్ని.. వెళ్లే మార్గాన్ని మూసివేశాడు.  డయ్యర్ ఆదేశాల మేరకు, అతని దళాలు పది నిమిషాల పాటు జనంపై కాల్పులు జరిపారు, వారి బుల్లెట్లను ఎక్కువగా ప్రజలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న కొన్ని బహిరంగ ద్వారాల వైపుకు నడిపించారు. కొంత మంది అక్కడ ఓ బావిలో దూకి ప్రాణాలు విడిచారని అంటారు.  ఏది ఏమైన ప్రపంచంలో ఇదో దుర్మార్గమైన దాడి అని అంటారు.  ఇది 1920-22 నాటి సహకార ఉద్యమానికి దారితీసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: