అనుకున్నదొకటి.. అయినదొక్కటి.. కొసరు  కావాలని పోతే, అసలు కూడా దొరక్కుండా పోయింది. మొత్తానికి చిన్న విలువని ఆశిస్తే.. పెద్ద విలువ చేజారిపోయింది. ఇలా ప్రతి ఒక్కరి  జీవితంలో జరిగే ఉంటాయి. ఒకటి కావాలి అనుకుంటే.. దానికి తోడు రెట్టింపు పోతుంది. ఆశకు హద్దుండాలి అంటుంటారు పెద్దలు. కానీ  హద్దు లేకుండా ఉంటాయి మన ఆశలు. ఇక్కడ ఓ వ్యక్తి కూడా పది రూపాయలు కోసం ఆశ పడితే.. 15 వేలు కట్టుకున్నారు ఓ మాల్ యాజమాన్యం.                                             

హైదరాబాద్ లోని కవాడిగూడ కు చెందిన  వి. బెజ్జం అనే వ్యక్తి. ఇటీవలే ఆయన ఓ షర్ట్ ను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇక షర్ట్ కోసం సెంట్రల్ మాల్ లో మొత్తానికి షాపింగ్ చేశాడు. కాగా తాను కొనుగోలు చేసిన షర్టు రూ.14 వేలు కాగా‌‌.. ఆ డబ్బులు చెల్లించి తన షర్టు ను తీసుకోవాలనుకున్నాడు. దీంతో ఆ షర్ట్ ను సెంట్రల్ మాల్ వాళ్లు ప్యాకింగ్ చేయగా అతనికి అందించారు. దీంతో ఆ షర్ట్ ను  మాల్ లోగో ముద్రించిన పేపర్ బ్యాగులో ప్యాక్ చేసి ఉంది.

 ఇక  ప్యాక్ చేసిన బ్యాగ్ ధర పది రూపాయలు కాగా.. వాటిని వసూలు చేసి అతడికి అందించారు. దీంతో ఆ వ్యక్తి కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తికే సెంట్రల్ మాల్ యాజమాన్యం రూ.15 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి రూ.10 ల కోసం మాల్ యాజమాన్యం ను బయటకు వేయాలనుకోగా చివరికి అతడే రూ.15 వేలు కట్టాల్సి వచ్చింది. అందుకే ఏదైనా వస్తువులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేటప్పుడు అక్కడ తీసుకునే ప్రతి వాటికి ధర అనేది పడుతుందని తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: