
బీట్ రూట్..
సాధారణంగా బీట్రూట్లో ఐరన్,క్యాల్షియం,పొటాషియం, పోలిక్ యాసిడ్,ఫైబర్ మరియు విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.కానీ పీరియడ్ సమయంలో బీట్రూట్ ని తినడం కానీ,జ్యూస్ కానీ తాగడం వల్ల,రక్తం వృద్ధి చెందించడమే కాకుండా,రక్తాన్ని పల్చగా చేయడంలో ఉపయోగపడి,రక్తసరఫరా పెంచుతుంది.దానితో ఈ సమయంలో రక్తస్రావం అధికమవుతుంది.కావున డైట్ లో ఉన్నవారు సైతం బీట్రూట్ జోలికి పోకపోవడం ఉత్తమం.
తేనె..
తేనె కలిపిన నీరు త్రాగడం లేదా తేనె వేసిన పదార్థాలను పీరియడ్ సమయంలో తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే తేనెకు శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.కావున అధిక రక్తస్రావానికి దోహదపడుతుంది.
కాఫీ..
చాలామంది పీరియడ్ సమయంలో ఉన్న డిజినెస్ ని పోగొట్టుకోవడానికి మరియు కడుపునొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుందని,కాఫీను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.కానీ కాఫీ ఉండే కెఫెన్ కు రక్తస్రావాన్ని పెంచే గుణం ఉంటుంది.కావున కాఫీ తీసుకోకపోవడం చాలా మంచిది.
డైరి ప్రోడక్ట్స్..
పీరియడ్ సమయంలో డైరీ ప్రొడక్ట్స్ అయిన పెరుగు, పాలలు,చీజ్ వంటివి తీసుకోవడం వల్ల,అందులో ఎక్కువగా స్యాచురేటెడ్ ప్యాట్స్ ఉంటాయి.అవి ఇన్ఫ్లమేషన్ ని కలిగించి,అధిక రక్తస్రావం అయ్యేందుకు దోహదపడుతుంది.మరియు పీరియడ్ సమయంలో వచ్చే బ్లోటింగ్ కి కూడా కారణం అవుతాయి.కనుక ఆ సమయంలో డైరీ ప్రొడక్ట్స్ తినకపోవడం మంచిది.
చాక్లెట్..
చాలామంది పీరియడ్స్ సమయంలో మూడిగా ఉంటారు.అలాంటప్పుడు చాక్లెట్ తినడం వల్ల,మైండ్ రిఫ్రెష్ అవుతుందని ఎక్కువగా చాక్లెట్ తింటూ ఉంటారు.కానీ చాలా అధికంగా చాకోలెట్స్ తీసుకోవడంతో,అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కనుక చాక్లెట్లు అవాయిడ్ చేయడం ఉత్తమం.