మనకి ఎక్కిళ్లు రావడం కామన్ అనుకుంటారు. నోరు ఎండిపోవడం, ఆహారం తీసుకోకపోవడం ఇంకా ఇతర కారణాల వల్ల ఎక్కిళ్లు వస్తాయని అనుకుంటారు.ఇక ఇవి సాధారణమైనవి. అవే వస్తాయ్.. అవే తగ్గుతాయి. అయితే, కొందరికి మాత్రం నాన్‌స్టాప్‌గా ఎక్కిళ్లనేవి వస్తాయి. నాన్ స్టాప్ ఎక్కిళ్ల వల్ల ఖచ్చితంగా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అసలు ఈ ఎక్కిళ్లు వచ్చేందుకు కారణాలేంటో ఇంకా వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అధిక మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కూడా ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయి.అలాగే వ్యక్తి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఎక్కిళ్లు వస్తాయి.ఇంకా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కిళ్లు వస్తాయి. అలాగే కొన్నిసార్లు అతిగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది.ఇంకా గాలి ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.సరిగ్గా నమలకుండా తినడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.అలాగే మసాలా ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.


ఇంకా జీర్ణక్రియ సరిగా జరుగకపోవడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.ఎక్కిళ్లు ఎక్కువగా వస్తూ ఉంటే.. నిమ్మకాయ ముక్కను తీసుకొని దాని వాసన పీల్చుకోవాలి.ఎందుకంటే ఇది వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.అలాగే ఎక్కిళ్లను ఆపడంలో ఏలకుల నీరు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక 2 ఏలకులను నీటిలో మరిగించి తరువాత ఆ నీటిని తాగాలి.ఇంకా తేనె కూడా ఎక్కిళ్లను తగ్గిస్తాయి.ఇంకా ఎక్కిళ్లు ఆగడానికి గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో కొన్ని పూదీనా ఆకులు, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ నీటిని తాగడం వలన ఎక్కిళ్లు ఈజీగా తగ్గుతాయి.అలాగే చిటికెడు ఇంగువ పొడి తీసుకుని అర టీస్పూన్ వెన్నతో కలిపి తినాలి. ఇలా తినడం ద్వారా ఎక్కిళ్లు ఈజీగా తగ్గుతాయి.ఇంకా శొంఠి, కరక్కాయ పొడిని మిక్స్ చేసి.. ఒక చెంచా పొడిని నీటితో కలిపి తీసుకుంటే ఈజీగా ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: