ఇప్పుడు చెప్పే టీని వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే.  బాదంపప్పును మనం నానబెట్టి పొట్టు తీసేసి తీసుకుంటూ ఉంటాము. దాన్ని వంటకాల్లో వాడుతూ ఉంటాము. కొందరు అయితే నేరుగా లేదా వేయించి తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా బాదంపప్పుతో మనం టీని కూడా తయారు చేసుకోవచ్చు. బాదంపప్పుతో చేసే ఈ టీ చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని ప్రతి రోజూ తీసుకోవచ్చు. లేదా వారానికి రెండు నుండి మూడుసార్లు తీసుకోవచ్చు. పైగా ఈ టీని తయారు చేసుకోవడం చాలా సులభం.ఈ టీని తాగడం వల్ల కూడా మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  బాదంపప్పుతో టీని తయారు చేసుకోవడానికి 5 బాదంపప్పులను జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పొడిని ఒక గ్లాస్ పాలల్లో వేసి కలపాలి. ఇప్పుడు ఈ పాలను ఒక 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి పక్కకు ఉంచాలి. ఆ తరువాత ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టీ పొడి, 3 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్, అర టీ స్పూన్ యాలకుల పొడి ఇంకా చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి వేడి చేయాలి.


ఈ టీని ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న బాదంపాలను పోసి బాగా కలపాలి.తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ టీని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా బాదం టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరుచూ తాగే టీ, కాఫీలకు బదులు ఇలా బాదం టీని తయారు చేసి తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బాదం టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే అల్జీమర్స్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.ఇంకా శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి.రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.ఇంకా వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. బాదం టీని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇలా బాదం టీని తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చలినుండి ఉపశమనం  కలుగుతుంది. ఈ విధంగా బాదం టీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: