
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వేరుశనగలు ఉపయోగపడతాయి. గుండె సమస్య నుంచి బయటపడడానికి సహాయపడతాయి. స్టడీస్ పరంగా కూడా సైంటిస్టులు చెడు కొలెస్ట్రాలను అంతం చేయడానికి చాలా బాగా సహాయపడతాయట. చెడు కొలెస్ట్రాల్ మన నరాల్లో పేరుకుపోయి రక్తం వెళ్లకుండా అడ్డుపడుతుంది. కానీ వేరుశనగలు ఈ బ్లాకీస్ పడకుండా అడ్డుకుంటాయి. దీని నుంచి గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే రాత్రి నిద్రపోయే ముందు పల్లీలను నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని తింటే పోషక విలువలు రెండింతలుగా పెరిగి శరీరానికి అందుతాయి. వేరుశనగ తిన్న తర్వాత నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రిక్ పండ్లను తినడం వల్ల గొంతు చికాకు వస్తుంది.
శరీర బరువుని తగ్గించడానికి పల్లీలు సహాయపడతాయి. పల్లీల్లో కేలరీస్ అధికంగా ఉంటాయి. కానీ ఇందులో అధికంగా ఉండే ప్రోటీన్స్ మరియు ఫైబర్ కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల మీకు చాలా సేపటి వరకు ఆకలి వేయదు. దీనివల్ల శరీర బరువుని తగ్గించుకోవచ్చు. అందుకే మీరు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా దీనిని తినడం బెస్ట్. షుగర్ ని కంట్రోల్ చేయడంలో పల్లీలు సహాయపడతాయి. వేరుశనగలను ప్రతి రోజు మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. వేరుశనగలు ఎక్కువ మోతాదులో గ్లైసమిక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని వాళ్ళ ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి.