
ఎండలోకి వెళ్తే చాలు ముఖం కమలిపోతుంది కదా. కానీ గడ్డం ఉంటే ఆ బాధ అక్కర్లేదు. సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి మీ చర్మానికి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. నాచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తూ వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.. అంటే మీ స్కిన్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే.
గడ్డం పెంచే మగాళ్లకు స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. గడ్డం లేని వారితో పోల్చితే గడ్డం ఉన్నవారి చర్మం చాలా సురక్షితంగా ఉంటుందని వారి పరిశోధనల్లో తేలింది.. మీ గడ్డం ఓ హెల్త్ గార్డ్ అన్నమాట.
మన చుట్టూ ఉన్న గాలిలో ఎంత కాలుష్యం, దుమ్ము, ధూళి ఉంటుందో తెలుసు కదా.. అవన్నీ మన ముక్కు ద్వారా లోపలికి వెళ్లకుండా మీ గడ్డం ఓ ఫిల్టర్‌లా పనిచేస్తుంది.. గాలిలోని చెత్తను ఇది అడ్డుకుని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.. సిటీల్లో తిరిగే వారికి ఇది ప్లస్ పాయింట్.
గడ్డం ఉన్న చోట మీ చర్మం సహజంగానే కొన్ని నూనెలను ఉత్పత్తి చేస్తుంది.. ఈ నూనెలు చర్మాన్ని ఎప్పుడూ తేమగా, మృదువుగా ఉంచుతాయి.. దీనివల్ల చర్మం పొడిబారడం, దురద రావడం లాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బయట నుంచి క్రీములు వాడాల్సిన అవసరం కూడా ఉండదు..
ఇవన్నీ ఆరోగ్య ప్రయోజనాలైతే, ఇక స్టైల్ గురించి చెప్పేదేముంది. గడ్డం మీ ఫేస్‌కి ఓ కొత్త లుక్, గంభీరత్వం ఇస్తుంది. చాలామందిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అందుకే గడ్డం కేవలం ఫ్యాషన్ కాదు.. అంతకు మించి మీ ఆరోగ్యానికి, అందానికి ఓ ప్లస్ చూశారా మరి.. గడ్డంతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. ఇక ఆలోచించకండి పెంచేయండి.