వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వేడికి భయపడిపోతూ ఉంటారు. వేసవి కాలం మొదలవటంతో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారమైన నిర్ణయాలు ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావం చూపుస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు శీతాకాలంలో శరీరానికి మేలు చెయ్యవచ్చు. కానీ వేసవిలో తినడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. బెల్లం కూడా అటువంటి ఆహార పదార్థాల్లో ఒకటి. మరి బెల్లం ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవికాలంలో దాని వినియోగం తగ్గించాలి. ఎందుకంటే దాని ప్రభావం వేడిగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కి కూడా హాని కలిగిస్తుంది.

మీరు దీన్ని ఎక్కువగా తీసుకుంటే అది ముక్కు నుండి రక్తాశ్రమం వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు బెల్లం తీసుకోవద్దు. అధిక మొత్తంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతారు. కరోనా అనంతరం ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లను దాదాపు మార్చుకుంటున్నారు. వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు.

ముఖ్యంగా వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో అనేక ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు. బలంలో సుకోజ్ ఉండటం వల్ల అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. చాలామంది మధుమేహంతో బాధపడేవారు చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తుంటారు. వీలైనంతవరకు బెల్లం తక్కువగా తీసుకోవడం ఉత్తమం. బెల్లంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. బెల్లం లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: