
కబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ E చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచుతాయి. ప్రతి రాత్రి నిద్రకు ముందు కొద్దిగా నూనెను ముఖానికి మసాజ్ చేయండి. చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. వయస్సు పెరిగేకొద్దీ వచ్చే ముడతలు కొబ్బరి నూనెతో తక్కువ చేయవచ్చు. ఇది చర్మపు లోతుల్లోకి ప్రవేశించి తేమను అందిస్తూ, ముడతల్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను వేడి చేసి జుట్టుకు రాసి కొన్ని గంటలపాటు ఉంచండి.
ఇలా చేయడం వలన జుట్టు బలంగా, నలుపుగా, మృదువుగా మారుతుంది. చర్మం కోసం మంచి పని చేస్తే, జుట్టు కోసం ఇంకా గొప్ప ఫలితాలు ఇస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ రాగాలు, అలర్జీలను తగ్గించగలవు. చిన్న మచ్చలు, తాకిడి వల్ల కలిగే వాపులు కూడా తగ్గుతాయి. కొబ్బరి నూనె వాసన మానసిక ప్రశాంతతనిస్తుంది. కొద్దిగా నూనెను నుదుటిపై మసాజ్ చేస్తే మెదడుకు విశ్రాంతి లభించి, మంచి నిద్ర రావటానికి సహాయం చేస్తుంది. తీవ్ర కాలుష్యంతో, ఒత్తిడితో కూడిన ఈ ఆధునిక యుగంలో, కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి, అందానికి ఒక ఆస్తిలా మారుతోంది. రోజూ కొద్దిగా నూనెను ఉపయోగించడం ద్వారా మీరు యవ్వనాన్ని నిలబెట్టుకోవచ్చు. ప్రతి రాత్రి నిద్రకు ముందు కొద్దిగా నూనెను ముఖానికి మసాజ్ చేయండి.