చాలామంది లవంగాల టీను. చాలా ఇష్టం గా తాగుతూ ఉంటారు. లవంగాలని ఎక్కువగా మసాలా దినుసులుగా పరిగణిస్తాము. బిర్యానీ లాంటి వాటిలో ఎక్కువగా వీటిని వాడతాము. లవంగాలు వంటకాల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా ఉపయోగించుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి. 

లవంగం టీ లో యాంటీ వైరల్, ఆంటీ మైక్రోబయల్ మరియు ఆంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. మరియు జలుబు జలుబు మరియు దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. లవంగం టీ తాగడం వల్ల చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. లవంగాల్లో ఉండే యుజనల్ అని రసాయన పదార్థం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటి నొప్పి నోటి దుర్వాసన నివారణకు సహాయపడతాయి. చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.


 దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా, కడుపులో వికారం ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. తేనె, కొన్ని లవంగాల నూనెను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. లవంగం టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మరియు లవంగం టీ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం మరియు అజీర్ణం నుండి ఉపశ్రమణం కలిగిస్తుంది. అంతే కాదు లవంగం టీ ని ఉపయోగించడం వల్ల పంటి నొప్పిని కూడా నయం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: