
రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే చూపు మెరుగవుతుంది, పొడిగా మారే కళ్లను తేమగా ఉంచుతుంది. క్యారెట్‌లో ఉండే ఆంటీఆక్సిడెంట్లు, పొటాషియం, డైటరీ ఫైబర్లు హృదయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును నియంత్రించి, హృదయ నాళాల్లో కొవ్వు పేరుకాకుండా చూసుకుంటుంది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ A, విటమిన్ C, మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మాన్ని నయం చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. చర్మాన్ని లోపలినించి పోషణ ఇచ్చి ప్రకాశవంతంగా చేస్తుంది.
క్యారెట్ జ్యూస్‌ను ఉదయాన్నే తాగడం వలన చర్మం ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్‌లో ఉండే ఫాల్కరినోల్ అనే యాంటీక్యాన్సర్ సమ్మేళనం క్యాన్సర్ కణాల ఎదుగుదలని అడ్డుకుంటుంది. ఇది ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రెగ్యులర్ క్యారెట్ జ్యూస్ తాగడం వలన క్యాన్సర్ కణాల ప్రవర్తనను నిరోధించవచ్చు. క్యారెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇది మెమరీ పెరగడంలో, అల్జైమర్స్ వంటి సమస్యలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. విద్యార్థులు లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నవారు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని తక్కువ చేస్తుంది. వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది.