ఈరోజుల్లో ప్రతి ఒక్క పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కి ఎక్కువ బానిస అయిపోయారు. పిల్లలను స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంచడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి పొరపాటు చేస్తున్నారు. వారికి స్మార్ట్ఫోన్ని చిన్నప్పుడే అలవాటు చేయొద్దు. దీనివల్ల వారు స్మార్ట్ ఫోన్ కి బానిసైపోతారు. అందుకే కొంతకాలం వరకు పిల్లలను మొబైల్ కు దూరంగా ఉంచడం మంచిది. పిల్లలకు క్రియేటివ్ పనులు అలవాటు చేయండి. దీంతో వారి క్రియేటివిటీ బయటపడుతుంది. 

పెయింటింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్ లాంటివి వారికి అలవాటు చేయొచ్చు. బాల్యంలో పిల్లలు మెదడు అభివృద్ధి చెందే సమయం. ఆ సమయంలో మొబైల్లో వచ్చే అనవసర విషయాలు మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే కిరణాలు పిల్లల కళ్ళకే కాదు మెదడు కణాలకు కూడా హానికరమే. ఫోన్ తరచుగా చూస్తే వారు బాహ్యాప్రపంచంతో వేరు అవుతారు. ఇలా వారికి లోకం ఏంటో తెలియదు. మొదటగా పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ సమయం ఇవ్వాలి. పిల్లలు ఎంత సేపు ఫోన్ వాడుతున్నారనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి.

మెసేజ్ చేస్తున్నారా? లేక కాల్స్ మాట్లాడుతున్నారా? ఎంతసేపు మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలి. వారిని వీలైనంత తక్కువసేపు బయటకు వెళ్ళనివ్వాలి. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే కళ్ళకి రక్షణ ఇచ్చే పద్దాలు తీసుకురావాలి. ఆన్లైన్ క్లాసులకి తప్ప మిగతా పనులకి ఫోన్ ని చేతికి ఇవ్వకూడదు. పిల్లలు ప్రతిదీ పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. మీరు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంటే, పిల్లలు కూడా దానికి దూరంగా ఉంటారు. కాబట్టి పెద్దవాళ్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు. కొంత సమయం వరకు ఫోన్ ఇవ్వండి. ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి ఫోన్ తీసుకోండి. ఇలా స్క్రీన్ టైం తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: