
చాలామంది షుగర్ పేషెంట్స్ కి అన్నం తింటేనే వాళ్ళ కడుపు నిండుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది . అలాంటి వాళ్ళు ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు అంటున్నారు డాక్టర్లు . వైట్ రైస్ తిన్న షుగర్ పెరగకుండా ఉండాలి అంటే ఒక చిట్కా ఉంది . మనం అన్నం వండుకునే ముందు బియ్యాన్ని నీటిలో నానబెట్టి .. ఆ తర్వాత వండుకోవాలి. చాలామంది టైం అయిపోతుంది అంటూ వెంట వెంటనే వంట చేయాలి అంటూ ప్రెజర్ కుక్కర్లో బియ్యం ని అప్పటికప్పుడు కడిగి నానపెట్టేసి అన్నం వండేస్తూ ఉంటారు . కొంతమంది రైస్ కుక్కర్ లో పెట్టేస్తూ ఉంటారు .
అది చాలా చాలా రాంగ్ . మనం అన్నం తినే ఒక గంట లేదా రెండు గంటల ముందు బియ్యాన్ని బాగా శుభ్రమైన నీటితో కడిగి ఆ తర్వాత బియ్యానికి తగ్గట్టు ఎసురు పోసి దాదాపు రెండు గంటలు లేదా ఒక గంట అయినా సరే ఆ బియ్యాని నానబెట్టి అన్నం గంజి వాడ్చి వండుకుంటే షుగర్ పేషెంట్స్ హ్యాపీగా అన్నాన్ని ఒక కప్పు వరకు తినొచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇలా నానబెట్టిన బియ్యంలో గ్లిజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది . అంతేకాదు అన్నం గంజి వంచేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా తగ్గిస్తుంది. తెల్ల బియ్యం కనీసం ఒక గంట నుంచి 30 నిమిషాల వరకు నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఒక గిన్నెలో గంజి వంచుకొని వండుకుని.. ఆ తర్వాత మనం చల్లబడిన తర్వాత తింటే షుగర్ లెవెల్స్ మరింత కంట్రోల్లో ఉంటాయి అంటున్నారు కొంతమంది డాక్టర్లు. అంతేకాదు రాత్రి అన్నం వండుకొని ఆ అన్నం ని చిన్న కుండలో ఒక మూడు స్పూన్ల వరకు పక్కన పెట్టి కొంచెం పెరుగు కొంచెం పాలు పోసి తోడు పెట్టుకొని పొద్దుపొద్దున్నే ఆ అన్నం తినడం వల్ల బిపి - షుగర్ బాగా కంట్రోల్ లో ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.
నోట్: ఇక్కడ అందించిన సమాచరం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఏది పాటించాలి అనుకున్న ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించి చేయడం మంచిది అని గుర్తుపెట్టుకోండి.