
ఇంటికి పెద్దదిక్కు మహిళలే అని ..మహిళల చేతుల్లోనే సంసారం బాగుపడాలి అన్న నాశనం అయిపోవాలన్న ఉంటుంది అని పండితులు చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా శుక్రవారం నాడు చేసే కొన్ని కొన్ని పనులు భర్త ఆయుషు భర్త సంపాదనను పెరిగేలా చేస్తుంది అని పండితులు చెప్తున్నారు . భర్తకు అదృష్టం కలిసి రావాలి అంటే కచ్చితంగా వారి కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటున్నారు.
*మరి ముఖ్యంగా భార్య శుక్రవారం నాడు అమ్మవారిని తీర్థ ప్రసాదాలతో పూజిస్తే చాలా చాలా మంచి జరుగుతుందట.
*అంతేకాదు శుక్రవారం నాడు చీర కట్టుకొని చేతినిండా గాజులు వేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లో తిరుగుతుంది అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు.
*కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అంటూ కొంతమంది చేతికి గాజులు వేసుకోవడం పూర్తిగా ఆపేస్తున్నారు .
*స్టైల్గా మెటల్ గాజులు వేసుకుంటున్నారు తప్పిస్తే మట్టి గాజులు వేసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
* కానీ మట్టి గాజులు వేసుకోవడమే పెళ్లయిన స్త్రీలకి చాలా చాలా మంచిది అంటున్నారు పండితులు.
*ఈ మట్టి గాజులు భర్త ఆయుషు ని కూడా పెంచుతుంది అంటున్నారు.
* ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు చేతినిండా వేసుకోవడం చాలా చాలా మంచిది అని అది తమ భర్తకి ఆయుషు పెంచేలా చేస్తుంది అంటున్నారు పండితులు
*ఆదివారం లేదా శుక్రవారంలో గాజులు కొనుక్కుని ఇలా వేసుకోవడం వల్ల భర్త ఆయుషు పెరుగుతుంది అంటున్నారు .
*గాజులు పగిలినవి అస్సలు వేసుకోకూడదు. అంతేకాదు కొన్ని కొన్ని మనం పాటించే నియమాల ద్వారా భర్త సంపాదన పెరుగుతుంది అంటున్నారు.
*పూజా మందిరంలో ఐదు యాలకులను పెట్టడం
* భర్త పర్సులో ఐదు యాలకులు ఉంచడం
* శుక్రవారం రోజు పసుపు వస్త్రం తీసుకొని అందులో పచ్చ కర్పూరం వేసి పూజ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే భర్త సంపాదనతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతూ వస్తుందట..!!
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం అని గుతుంచుకోవాలి..!!