
కరివేపాకును ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొద్దిగా తింటే నుండి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకులో సహజమైన హైపోగ్లైసెమిక్ లక్షణాలు ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ కరివేపాకును జ్యూస్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, హార్ట్ అటాక్ రిస్క్‌ను తగ్గించగలదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి. మొటిమలు, చర్మపు అలర్జీలు, దద్దుర్లు వంటి సమస్యలకు కరివేపాకు మంచిదిగా పనిచేస్తుంది. కరివేపాకును రుబ్బి పేస్ట్ చేసి చర్మంపై రాసినట్లయితే చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ A మరియు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రాత్రిపూట చూపు తగ్గే సమస్య నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో సహజ రక్తశుద్ధికర లక్షణాలున్నాయి. ఇది టాక్సిన్లను తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మెటాబాలిజాన్ని పెంచి శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. 5–10 తాజా కరివేపాకులు కొద్దిగా నీళ్లతో కలిసి తినండి. ఇది డైజెస్టివ్ ట్రాక్ట్‌ను శుభ్రం చేస్తుంది. కరివేపాకా, వెల్లుల్లి, జీలకర్ర, తులసి కలిపి కషాయం వేశి తాగితే జలుబు, దగ్గు, జ్వరానికి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకా, కారం, ఇంగువ, మినప్పప్పు, జీలకర్ర కలిపి పొడి చేసుకుని అన్నంలో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకా నూనెను తలపై అప్లై చేస్తే జుట్టు బలంగా, పొడిగా ఉండకుండా ఉంటుంది. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అలసట, వాంతులు, పేగు సమస్యలు రావచ్చు.