
శరీరంలో వాపు, నరాల నొప్పులు, ముస్లుల నొప్పులను తగ్గించడంలో అల్లా సహాయపడుతుంది. అర్థరైటిస్, జాయింట్ పైన్ ఉన్నవారు అల్లం తింటే ఉపశమనం పొందుతారు. హృదయ ఆరోగ్యానికి మేలు. అల్లం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం తీసుకోవడం వలన రక్త ప్రవాహం సజావుగా సాగుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు సరిగా ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. పచ్చి అల్లాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాల ఏర్పడడాన్ని నిరోధించే శక్తి ఉంది. ముఖ్యంగా కోలోన్ క్యాన్సర్ మరియు అగ్నాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పచ్చి అల్లా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అల్లం మెట్‌బాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వు కరిగించే శక్తిని కలిగి ఉంటుంది. ఆకలి తగ్గించి తక్కువగా తినేలా చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు రావడం తగ్గుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న ముక్క పచ్చి అల్లం తినవచ్చు. తేనెతో కలిపి చిన్న ముక్క తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి. టీ లో వేసుకుని తాగడం వల్ల గ్యాస్, జలుబు తగ్గుతాయి. అధికంగా తీసుకుంటే అజీర్ణం లేదా ఎసిడిటీకి కారణమవచ్చు. గర్భిణీలు, మందులు వాడేవారు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వినియోగించాలి.