ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఏర్పడింది .  ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి .. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి పెరిగిన విషయం తెలిసిందే .. ప్రధానంగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ కూడా దాటి .. ఆ తర్వాత కాస్త ప్రజలకు ఉరాట ఇచ్చింది .. ఈ క్రమంలోని మళ్లీ బంగారం ధరలు అమాంతం పెరగడంతో పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.. అలాగే వెండి ధరలు కూడా బంగారం బాటలోనే అడుగులు వేస్తున్నాయి .. ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త కారణాలతో ధరల్లో పెద్దగా ఎలాంటి తేడా ఉండటం లేదు .. తాజాగా బంగారం , వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి .. జులై 6 , 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు పలు నివేదికలో నమోదైన ధరల ప్రకారం .. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98,830 ఉండగా .. 22 క్యారెట్ల ధర 90,600 గా ఉంటుంది .. అలాగే వెండి ధర లక్ష పదివేలుగా కొనసాగుతుంది .. మన ప్రాంతీయ ప్రాంతాల వారీగా బంగారు , వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది .


మన దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం :

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,600 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది.

విజయవాడ , విశాఖపట్నం లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830, 22 క్యారెట్ల ప‌సిడి రూ.90,600లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,20,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,980, 22 క్యారెట్ల ధర రూ.90,750 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,830, 22 క్యారెట్ల ధర రూ.90,600 ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 గా ఉంది.

చెన్నై లో 24 క్యారెట్ల పసిడి రూ.98,830 ఉండగా..  అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.90,600 గా ఉంది . వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,830, 22 క్యారెట్ల ధర రూ.90,600 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: