
మధునాశిని పొడిని లేదా ఆకు తురుమును నీటిలో మరిగించి వడకట్టి తాగాలి. ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. మధుర రుచిని తగ్గించి మిఠాయిల మీద ఆకర్షణను తగ్గిస్తుంది. అరటికాయ కాండాన్ని చిన్న ముక్కలుగా కోసి రసం తీయాలి. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కలపవచ్చు. డయాబెటిక్ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తారు. బాడీలో టాక్సిన్స్ తగ్గించి మేతాబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను క్రమంగా తగ్గిస్తుంది. కొత్త అల్లం తురుమును నీటిలో మరిగించి, నిమ్మరసం కలిపి తాగాలి. షుగర్ లేకుండా తాగాలి. అల్లం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది.
నిమ్మకాయలోని విటమిన్ C శరీరంలో గ్లూకోజ్ మెటబలిజాన్ని సరిచేస్తుంది. వాపులు తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగాలి. కరివేపాలోని ఫైటోకెమికల్స్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. కోలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. తాజా ఆవల కాయలను తురిమి రసం తీయాలి. కొంచెం తేనె లేదా మజ్జిగతో కలిపి తాగవచ్చు. విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటంతో శరీర శుద్ధి జరుగుతుంది. బీటరూట్ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, పుదీనా కలిపి రసం తీయాలి.