
గత ఎన్నికల్లో రాంబాబు....దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు...అసలు రాష్ట్రంలో జగన్ తర్వాత రాంబాబుదే హయ్యెస్ట్ మెజారిటీ. జగన్‌కు 90 వేల ఓట్ల పైనే మెజారిటీ వస్తే…రాంబాబుకు 80 వేల ఓట్ల పైనే మెజారిటీ వచ్చింది. మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేపై ప్రజలకు భారీగానే అంచనాలు ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా రాంబాబు...గిద్దలూరులో పనిచేస్తున్నారా? అంటే కాస్త అవునని, కాస్త కాదనే చెప్పొచ్చు.
ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాంబాబుకు పెద్ద ప్లస్ పాయింట్స్. కానీ అవి గాకుండా గిద్దలూరులో రాంబాబు సెపరేట్‌గా చేసే కార్యక్రమాలు ఏమి పెద్దగా కనిపించడం లేదు. పైగా వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు..ఆ మధ్య రోడ్ల గురించి ఓ జనసేన కార్యకర్త ప్రశ్నిస్తే, అతన్ని వైసీపీ నేతలు అనేక ఇబ్బందులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని పవన్ అంటున్నారు. ఆ విషయం తాను మర్చిపోలేదని, అన్నీ తిరిగిచ్చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. ఇక గిద్దలూరులో సమస్యలు ఎక్కువే...అలాగే వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇటు టిడిపి నేత అశోక్ రెడ్డి వేగంగా పుంజుకుంటున్నారు. ఈ మధ్య వైసీపీకి చెందిన కార్యకర్తలు టిడిపిలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. అధికార పార్టీని వదిలేసి టిడిపిలోకి వస్తున్నారంటే గిద్దలూరులో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. మొత్తానికి గత ఎన్నికల్లో వచ్చిన భారీ మెజారిటీనే రాంబాబు కొంపముంచేలా ఉంది.