తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్ బాస్ షో అనేది అతి పెద్ద రియాలిటీ గేం షో అనే సంగతి మనకు తెలిసిందే. కొందరు బాగా పాపులర్ అయిన సెలబ్రిటీస్ ని ఒక్క ఇంట్లోకి తీసుకెళ్లి కోన్ని రోజులు సెల్ ఫోన్, టీవీ..బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తారు. ఇక బిగ్ బాస్ సమయానుసారం కొన్ని టాస్కులు ఇచ్చి ఆడమంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ హౌస్ లోపలికి వెళ్లిన కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా పెడుతారు బిగ్ బాస్.

ఉన్నది లేనట్టు లేని ఉన్నట్లు కూడా చూపించే సాహసాలు కూడా చేస్తారు. మీరు బాగా గమనించిన్నట్లైతే..ఇప్పటి వరకు నాలుగు సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజుతో ఐదవ సీజన్ కూడా కంప్లీట్ అవుతుంది.  బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన ఒక్కరు అంటే ఒక్క కంటెస్టేంట్  అయినా  సరే  బిగ్ బాస్ గురించి పాజిటివ్ గా మాట్లాడకపోవడం గమనార్హం. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్  కు వెళ్లి బ్యాడ్ గా అనిపించుకున్నారు కానీ ..మంచి పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ లేరు. గీతా మాధురి,దీప్తి సునయన, పున్నర్ నవి భూపాలం , దేత్తడి హారిక, హమీదా, సిరి..ఇలా అందరిని బాగా వాడుకున్నారు బిగ్ బాస్. ఇక యానీ మాస్టర్ సైతం బిగ్ బాస్ పై మండిపడుతూ ఇక చాలు మీ గేం బిగ్ బాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, సీజన్ 5 విన్నర్ గా సన్నీ నిలిచాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక బిగ్ బాస్ పై మడిపడింది. ఇది చెత్త నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన ఇన్స్టా అకౌంట్ లో  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ కంటెస్టెంట్‌ దేత్తడి హారిక  "స్టార్‌ మా"ను తిడుతూ చేసిన పోస్ట్‌ వైరల్ గా మారింది. ఇది చెత్త నిర్ణయం స్టార్‌ మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హారిక ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. హారిక ఈ పోస్ట్‌ పెట్టింది సన్నీ గెలిచినందుకేనా అంటూ సందేహాలు తలెత్తాయి. అసలు అలాంటి పోస్ట్‌ ఎందుకు పెట్టిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: