పుష్ప..పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు. వెండితెరపై మంట పెట్టిన పుష్పరాజ్ తెలివిగా ప్రైమ్ లో దిగ బోతున్నాడు. డిసెంబర్ 15 న రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి సంచలనాలను సృష్టించింది. బాలీవుడ్ లో వసూళ్ల ప్రభంజనం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. పుష్ప రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నా కలెక్షన్ల సునామీ మాత్రం ఆగకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

 పుష్ప సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ కి  ఫిదా కాని వారు లేరు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కథ మొదలైన దగ్గర నుంచి పుష్ప రాజ్ పాత్రను ఎలివేట్ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్ లుక్ లోనూ కాదు, నటనలోనూ అల్లు అర్జున్  అదరగొట్టేసారు. ఏ సన్నివేశం చూసినా తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించారు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి.అందుకే అన్ని ఇండస్ట్రీల్లో ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇలాంటి టైం లో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప సినిమాను ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. థియేటర్లలో ఇంకా సినిమా రన్ అవుతున్నందుకు కనీసం 90 రోజుల తర్వాత దీన్ని ఓటిటి లో విడుదల చేయాలనిమూవీ టీం మొదటినుంచి భావించింది.కానీ ఇప్పుడు సంక్రాంతిని క్యాష్ చేసుకునే పనిలో పడిందట. కానీ మనసు మార్చుకుని పండగ సీజన్లోనే విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

కొంతమంది సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే స్టార్ హీరో సినిమా, భారీ విజయం సాధించిన సినిమా ఎందుకు ఓటిటీకి అని ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయినా కూడా ఓటిటి నుంచి మంచి ఆఫర్ రావడంతో చిత్ర యూనిట్ దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక జనవరి 7న రాత్రి 8 గంటల నుంచి పుష్ప సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: