హీరోయిన్ సమంత.. ఇప్పుడు ఫ్రీబర్డ్.. కొన్నినెలల క్రితమే ఆమె నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయితే విడాకుల తీసుకున్న తర్వాత ఆమె పెద్దగా మీడియాతో మాట్లాడలేదు.. విడాకుల విషయాన్ని సాధ్యమైనంతగా మర్చిపోతూ.. తన రెగ్యులర్‌ లైఫ్‌లో పడేందుకు ఆమె చాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆటవిడుపుగా ఆమె స్నేహితురాళ్లతో ప్రకృతి సెలయేళ్ల మధ్య సేదతీరిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.


అయితే.. తాజాగా ఆమె తన మానసిక సమస్యల గురించి మాట్లాడింది. హైదరాబాద్‌లో రోష్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. తాను తన జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని నటి సమంత కామెంట్ చేసింది. అయితే.. అలా మానసిక సమస్యలు వచ్చిన ప్రతిసారీ తాను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు అనిపించేదని వివరించింది. అయితే.. ఆ సమయంలో కొందరు మిత్రులు, వైద్యుల సాయం పొందానని.. వారి అండతోనే తాను సమస్యల నుంచి బయటకు రాగలిగానని సమంత చెబుతోంది.


తాను ధైర్యంగా నిలబడేందుకు తనకు ఎందరో సాయం చేశారన్న నటి సమంత.. అలా సాయం చేసిన వారిలో స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్లు ఉన్నారని వివరించింది. మన శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను సంప్రదిస్తాం కదా.. అలాగే మనసుకు గాయమైనా సరే వైద్యులను సంప్రదించాలని సమంత అంటోంది. అవును నిజమే.. శరీరానికి అయిన గాయాలు క్రమంగా మానిపోతాయి. కొన్నాళ్లకు అసలు మనకు అక్కడ గాయం అయ్యిందన్న సంగతి కూడా తెలియనంతగా మానిపోతాయి.


కానీ.. మానసిక గాయాలు అలా కాదు.. ఏళ్ల తరబడి వేధిస్తాయి.. మనసుని కష్టపెడతాయి. మరి అలాంటి మానసిక సమస్యల విషయంపై నిర్లక్ష్యం చేస్తే.. అవి మరింతగా మనల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే మానసిక సమస్యల పరిష్కారం కోసం సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ సంస్థ.. మీ ఇంటి వద్దే మానసిక సమస్యలకు పరిష్కారాలు చూపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: