విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తాజాగా ఎఫ్ 3 సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించగా, ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయ్యింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ విడుదల అయిన మొదటి షో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. 

ఇలా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ను వసూలు చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా జూలై 22 వ తేదీ నుండి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కాబోతోంది.  ఎఫ్ 3 మూవీ జూలై 22వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినా సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

అలాగే ఎఫ్ 3 మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ కూడా తాజాగా ప్రకటించింది. ఇలా ఎఫ్ 3 మూవీ జూలై 22 వ తేదీ నుండి సోనీ లివ్ మరియు నేట్ ఫ్లిక్స్ రెండింటిలోను స్ట్రీమింగ్ కాబోతోంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్లలో చూద్దామని మిస్సయిన వారు ఉంటే జూలై 22 వ తేదీ నుండి సోనీ లివ్ మరియు నేట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: