ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది నటి నటులు చెప్పుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా మరో నటుడు కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి రవి కిషన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన రేసు గుర్రం మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

మూవీ లో విలన్ పాత్రకు గాను రవి కిషన్ కు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. అలాగే ఈ నటుడు ఈ సినిమాతో పాటు కిక్ 2 ... సుప్రీమ్  మూవీ లలో కూడా విలన్ పాత్రలలో నటించాడు. ఈ రెండు మూవీ ల లోని నటన కు కూడా రవి కిషన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రలో ఈ నటుడు నటించాడు.

ఇప్పటి వరకు రవి కిషన్ ఎక్కువ శాతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఈ నటుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాడు. తాజాగా ఇంటర్వ్యూలో రవి కిషన్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ... నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఓ మహిళ నుండి కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను అని ... ప్రస్తుతం నేను ఆమె పేరు చెప్పలేను. ఆమె ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఉంది. కాపీ కోసం రాత్రికి రావాలి అని ఆమె పరోక్షంగా కోరింది. విషయం అర్థం ఇవ్వడంతో నేను నో చెప్పాను అని ఈ నటుడు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: