భయం ఒక పెను భూతం దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంతకు రెట్టింపు శక్తితో మనలను భయపెడుతూ మన లక్ష్యాలను చేరనీయకుండా అవరోధాలు కల్పిస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలోను అనేక అంతర్గత భయాలు ఉంటాయి వాటినే ఫోబియాలు అని అంటారు. 


మనస్తత్వ శాస్త్ర వేత్తల పరిశోధనల ప్రకారం ప్రతి వ్యక్తి మనసులో 101 రకాల భయాలు ఉన్నాయి అని అంటారు. ప్రారంభించే ముందు ప్రతి పని కొత్తదిగా కనిపిస్తుంది కాబట్టి ఆపని పట్ల భయం ఆపని చేసే వ్యక్తిని వెంటాడుతూనే ఉంటుంది. అందువల్లనే ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో అదేవిధంగా తాను ఎంచుకున్న వ్యాపారంలో రాణించాలి అంటే ముందుగా ఈ భయాల నుండి బయటపడాలి. 


వాస్తవానికి అవకాశానికి భయం బద్ధ శత్రువు. ఈ భయాలు వల్ల మనం ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటాము. ఏవ్యక్తి అయినా రాణించాలి అంటే ముందుగా కావలసింది తన పై తనకు నమ్మకం ఉండటం. ఆ నమ్మకాన్ని భయం పోగొట్టి మనిషి విజేత కాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మనకు తెలియకుండానే మనమీద ఆధిపత్యం చలాయించే భయాన్ని పోగొట్టుకోకుండా ఏ వ్యక్తి రాణించలేడు. అలా రాణించని వ్యక్తి దగ్గర సంపద ఉండదు. 


ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలి అన్నా సక్సస్ తారక మంత్రంగా మారిన పరిస్థితులలో ముందుగా భయం ఫోబియా నుండి తనను తాను రక్షించుకున్న వ్యక్తి మాత్రమే తాను ఎంచుకున్న రంగంలో తాను కోరిన విధంగా ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు. మన మనసులో అనుక్షణం ఘర్షణ చేసుకునే విరుద్ధ భావాలు అయిన భయం నమ్మకం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటాయి ఈ యుద్ధమే ఒత్తిడి. ఈ ఒత్తిడిని తట్టుకుని నిలబడగల వ్యక్తి మాత్రమే వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా రాణించగలుగుతాడు. ఆ రాణింపు వచ్చిన మరుక్షణం మనం కోరుకోకుండానే సంపద దరి చేరుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: