సంపాదించే డబ్బులో కేవలం పది శాతం డబ్బును విధిగా పొదుపు చేసేవారు ధనవంతులు అయి తీరుతారని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. నేటి కాలంలో బ్యాంకులు ఇతర ఆర్ధిక సమస్యలు తమ లావాదీవీలలో చక్ర వడ్డీ విదిస్తూ ఉంటాయి. చక్ర వడ్డీకి ఉన్న శక్తి  గురించి చాలమందికి తెలియదు. 


సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచపు స్థితిని గతిని మార్చిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చక్రవడ్డీకి ఉన్న శక్తిని మొదటిసారి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్య పోయాడు అంటూ కొందరు అంటూ ఉంటారు. అందుకే అప్పట్లో ఐన్ స్టీన్ ఒక వ్యాసం రాస్తూ ‘చక్రవడ్డీ అనేది ఈ ప్రపంచంలో సహజ సిద్ధమైన 8వ అద్భుతం ఇప్పటివరకు నాకు తెలిసిన శక్తులలో అత్యంత శక్తివంతమైనది చక్రవడ్డీ’ అంటూ అభిప్రాయపడినట్లు ఆనాటి ఐన్ స్టీన్ జీవితానికి సంబంధించిన పుస్తకాలు చదివిన వారికి అర్ధం అవుతుంది. 


చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కటిక దారిద్ర్యంలో బాధపడే వాళ్ళు ఇలా ఎవరినైనా సంపన్నులుగా మార్చగల ఆర్ధిక సూత్రం కనీసం మనకంటూ మనం దాచుకునే పొదుపు. దినసరి వేతనం నుండి భారీ జీతాలు పొందే ఉద్యోగుల వరకు తమకు వచ్చే ఆదాయంలో కనీసం 10 శాతం డబ్బును ముట్టుకోకుండా కొన్ని సంవత్సరాలు ఉంచి ఆ డబ్బుతో ఏదైనా ఒక ఆస్థిని కొంటే ఆ ఆస్థి మనకు బానిసగా మారి మరింత ఆదాయాన్ని సంపాదించి పెడుతుందని మనీ ఎక్స్ పర్ట్ లు చెపుతూ ఉంటారు. 


చాలామంది జీవితాలలో ఉండేకష్టాలకు అశాంతికి చాలినంత డబ్బు లేకపోవడమే ఒక ప్రధాన కారణం. ఈసమస్యను అధికమించాలి అంటే ఏవ్యక్తి అయినా డబ్బు విత్తనాలు నాటాలి ఆ డబ్బు విత్తనాలే పొదుపు. విత్తనం ఎంత చిన్నది అయినా ఒక మహావృక్షంగా మారుతుంది అన్నట్లుగా క్రమం తప్పకుండా చేసే చిన్నచిన్న పొదుపు భవిష్యత్తులో మనకు సంపదను పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: