వన్ ఇండియా వన్ కార్డ్ వన్ ఇండియా వన్ ఎలక్షన్ స్లొగన్స్ లో ఇప్పుడు ఒకే దేశం ఒకే మార్కెట్ అన్న స్లోగన్ కూడ జత కలిసి భారత ఆర్ధిక వ్యవస్థ రూపు రేఖలు మారబోతున్నాయి. విశాలమైన భారతదేశం అంతటా రైతులు తాము పండించే పంటను క్రయవిక్రయాలు చేసుకోవచ్చు అని రూపొందింపబడ్డ ఈ చాటం పై కేంద్రంలోని అధికార పక్షం ప్రశంసలు కురిపిస్తూ ఉంటే దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఐఖ్యత పాటిస్తూ ఈ చట్టం పై విమర్శలు చేస్తున్నాయి.


భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశం మన జాతీయ ఆదాయంలో ఇప్పటికీ ఎక్కువ శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. దీనితో దేశంలోని అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు నాయకులు రైతు జపం చేస్తూ రైతుల గురించే మాట్లాడుతూ ఉంటారు. అయితే రైతు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ వ్యవసాయం అంటే కష్టాల సుడిగుండం అన్న అభిప్రాయం పడింది.


దీనితో వ్యవసాయ కుటుంబాలలోని యువత కూడ వ్యవసాయం వైపు మొగ్గుచూపడం లేదు. మన పక్క దేశం చైనాలో సాగు విస్తీరణం మనదేశంలో కంటే తక్కువ అయితే చైనా వ్యవసాయ ఉత్పత్తులు మనకంటే రెండు రెట్లు అధికం. దీనికి కారణం వ్యవసాయం పై పెట్టుబడులు డైరెక్ట్ గా ప్రభుత్వాలె పెడతాయి. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం బయో టెక్నాలజీని కూడ వ్యవసాయంలో విపరీతంగా వాడతారు.


ఈ విషయంలో ఎలా వెనకబడి ఉన్న భారత్ కు ఒకే దేశం ఒకే మార్కెట్ అనే ఆలోచన కుదురుతుందా అన్న విషయం పై చాల పెద్ద స్థాయిలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ విషయమై వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫిసర్ మహేంద్ర దేవ్ అభిప్రాయం ప్రకారం మన దేశంలో వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పంటలు వేరువేరు వినియోగ రీతులు ఉన్నాయని ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయ ఉత్పత్తులకు దేశమంతా ఒకే మార్కెట్ అన్న ఆలోచన ఏమాత్రం ఆచరణీయం కాదనీ ఈ చట్టం వల్ల చిన్న రైతుల కంటే బాగా లాభ పడేది కార్పోరేట్ కంపెనీలు మాత్రమే అంటూ దేశంలోని 86 శాతం సన్నకారు రైతులకు ఈ చట్టం ఏమాత్రం ప్రయోజనకారి కాదు అంటూ అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: