డబ్బు సంపాదించాలని కోరికలేని వ్యక్తి  ఉండడు. ఒక నగల కంపెనీ యాడ్ లో చెపుతున్నట్లుగా ‘డబ్బులు ఎవరికీ ఊరికనే రావు’ ఈ రోజుల్లో డబ్బు కనీస అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ఏ  అవసరం తీర్చుకోవాలన్నా డబ్బు చాల అవసరం. కాబట్టి డబ్బుకు సంబంధించి ముఖ్యంగా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి.


మనలో చాలామంది డబ్బు ఉన్నవారి వద్దకే డబ్బు వెళుతుందని అంటారు. కొద్ది మందికి మాత్రమే డబ్బు సంపాదించడం మాత్రం వెన్నతో పెట్టిన విద్య అన్న సామెత ఉంది. అందువల్ల కష్టపడి ప్రయత్నాలు చేసినా డబ్బు సంపాదించడం కష్టం అనే అభిప్రాయంలో చాలామంది ఉంటారు అయితే ఈ ఆలోచనలు నిజం కాదు.  డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న ప్రతి వ్యక్తి తన దగ్గరలో ఉన్న డబ్బును అదుపులో పెట్టుకోగలిగితే ఉండాలి అలాగే ప్రతి మనిషీ తన శ్రమతో డబ్బు సంపాదించి దాన్ని కొంతకాలం తన అదుపులో పెట్టుకుని ఆ తర్వాత ఇతరులతో పంచుకోవడం ద్వారా డబ్బు మరింత సంపాదించ గలుగుతాడు.  


దీనికోసం ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బును సరైన పద్దతిలోవినియోగించాలి. అందుకే డబ్బు ఒక శక్తివంతమైన గన్ లాంటిది అంటారు.  ఆ గన్ ను సరిగ్గా వాడటం తెలియకుంటే అసలుకు ప్రమాదం ఏర్పడి మన దగ్గర ఉన్న డబ్బును కోల్పోయే ప్రమాదం సంభవించవచ్చు అందుకే చాలామంది అంటూ ఉంటారు. డబ్బు మంచి స్నేహతుడు అవ్వగలడు మంచి సేవకుడు అవ్వగలడు.  అందుకే మనం  సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనే విషయం పై మన ఆర్ధిక వృద్ధి ఆధార పడిఉంటుంది. అందుకే డబ్బు సంపాదించడం ఒక ఒక కళ అయితే ఆ సంపాదించిన డబ్బుని మనం ఎలా వాడుతున్నామనే విషయం  పై మన అభి వృద్ధి ఆధారపడి ఉంటుంది. ‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాటలు నిజం అయినప్పటికీ  డబ్బును అర్ధం చేసుకో గలిగినప్పుడే  ఏవ్యక్తి అయినా ధనవంతుడు కాగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: