దేశీయంగా డిజిటల్ విభాగంలో గల అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ ప్రభావం తదితర పలు అంశాలను ప్రస్తావించారు.డిజిటలైజేషన్‌లో దేశాన్ని ప్రధాని మోడీ ముందుండి నడిపిస్తున్నట్లు జుకర్‌బర్గ్, ముకేశ్ అంబానీ ప్రశంసించారు.ముకేశ్ అంభానీ మాట్లాడుతూ,భారత్ సంక్షోభానికి,ఉగ్రవాదానికి ఉప్పుడు భయపడబోదని తెలిపారు. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ కారణంగా ఎన్నో అవకాశాలు యువతకు కల్పిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా అభివృద్ధి వేగం పెరిగిందని అన్నారు. ప్రభుత్వం సృష్టించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకెంతో మేలు చేస్తుందని గుర్తు చేశారు.
డిజిటల్ టూల్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించనుంది. దేశీయంగా కోట్ల కొద్దీ ప్రజలకు ఇంటర్నెట్ ప్రయోజనాలను అందించడంలో రిలయన్స్ జియో కీలకంగా మారిందని ముకేశ్ అంభానీ తెలిపాడు. రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతోంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను రూ. 43,754 కోట్లకు ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి