సాధారణంగా పాత కాయన్లకు విలువ ఉండదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పాత కాయిన్ లే ఇప్పుడు లక్షల్లో, కోట్లలో ధర పలుకుతున్నాయి అంటే ఎవరైనా నమ్మగలరా..? నిజమేనండీ..పాత కాయిన్ లకు ఇటీవల కాలంలో చాలా డిమాండ్ పెరిగింది. అందుకు కారణం కొంతమంది వాటి మీద ఉన్న గుర్తులను చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి. ఆ కాయిన్ లను కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలను  కూడా వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా పాత కాయిన్ ల  మీద వైష్ణవి మాత ప్రతిమ ఉన్న కాయిన్ కి లక్షల్లో ధర పలుకుతోంది. ఇందుకు కారణం వైష్ణవి మాత ప్రతిమ వున్న కాయిన్ ను వైష్ణవీయులు   అదృష్టంగా భావిస్తారు కాబట్టి.ఇక అందుకోసం  వారు లక్షల రూపాయల్లో  డబ్బులు పెట్టి మరీ  కూడా కొనుగోలు చేయడానికి వెనుకాడడం లేదు.


అంతేకాదు ఇటీవల పాత నోట్లపై కూడా 786 నెంబర్ కలిగిన నోట్లను, ముస్లిం మతస్తులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఒక పాత అర్ధ రూపాయి కాయిన్ కొనుగోలు చేయడానికి కొంత మంది ముందుకు వస్తున్నారు. అయితే ఆ అర్ధరూపాయి మీద ఉండవలసిన గుర్తులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. అది ఏదో కాదు 2011వ సంవత్సరంలో ముద్రించబడిన రూపాయి 50 పైసలు కాయిన్. ఈ కాయిన్లను 2011 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ముద్రించడం నిలిపివేసింది. ఇప్పుడు కాస్త ఆ కాయిన్ విలువ పెరిగింది. అందుకే చాలామంది 2011 సంవత్సరంలో ముద్రించబడిన 50పైసలు కాయిన్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇక మీరు ఈ 50 పైసలు కాయిన్ ను అమ్మదలచుకుంటే, OLX వెబ్ సైట్ లో దీనిని వేలంపాట లో ఉంచవచ్చు. ఇక ఈ 50 పైసల కాయిన్ ను, ఇరువైపులా స్పష్టంగా ఫోటోలు తీసి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎవరైతే ఈ కాయిన్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారో వారితో లావాదేవీలకు సంబంధించిన సంప్రదింపులు జరిపి వాటిని మీరు అమ్మవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: