సాధారణంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు వినియోగదారుల ఇంటి వద్దకే వస్తువులను అందించడానికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ కామర్స్ సంస్థలు కూడా ఫ్రాంచైజీలుగా కాంట్రాక్టులు ఇస్తున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను ఫ్రాంచైజీ తీసుకున్నవారు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ డెలివరీ భాగస్వామి కావడానికి మీరు కొన్ని షరతులకు తప్పకుండా లోబడి ఉండాలి. మొదటగా మీకంటూ ఒక సొంత కారు ఉండాలి అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మీరు డెలివరీ తేదీలకు తప్పనిసరిగా డెలివరీ ఇస్తానన్న హామీని కూడా ఇవ్వగలగాలి.
అలాగే మీకంటూ ఒక 1500 చదరపు అడుగుల స్థలం తప్పనిసరిగా ఉండాలి. ఇకపోతే ఈ ఫ్లిప్కార్ట్ డెలివరీ ఫ్రాంచైజీ ధర అనేది ప్రాంతాన్ని బట్టి.. తీసుకునే ఆర్డర్లను బట్టి మారుతూ ఉంటుంది. కనీసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య బడ్జెట్ ఉన్నట్లయితే ఫ్లిప్కార్ట్ ఫ్రాంచైజీ అయితే తీసుకోవడం తప్పనిసరి. ఇకపోతే ఫ్లిప్కార్ట్ డెలివరీ భాగస్వామిగా మీరు ఎంత లాభాన్ని పొందవచ్చు అనే విషయం తెలియాలి అంటే మీరు తీసుకున్న ప్రాంతం ఆర్డర్ల సంఖ్యను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా వాటిని బట్టి మీ లాభం కూడా మారుతూ ఉంటుంది.
డెలివరీ స్థానం వస్తువుల స్వభావాన్ని బట్టి కమిషన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి రూ .5 లక్షల నుంచి పది లక్షల రూపాయలు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ డెలివరీ భాగస్వామి గా మారడానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డెలివరీ కచ్చితమైన తేదీలకు ఇస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే మీరు ఫ్రాంచైజీ లను తీసుకోవడానికి అర్హులవుతారు. ఏది ఏమైనా ఫ్లిప్కార్ట్ డెలివరీ పార్ట్నర్ గా మీరు మంచి ఆదాయం పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి