సాధారణంగా చాలామంది బ్యాంక్ రుణాలు సైతం పొందాలి అంటే కచ్చితంగా ఏదో ఒక గ్యారెంటీ అడుగుతూ ఉంటారు.. చాలామంది బ్యాంకర్స్ సైతం తీసుకున్న వ్యక్తి రుణాన్ని చెల్లిస్తారా లేదా అనే అంశాలను కూడా ఎక్కువగా పరిగణంలోకి తీసుకుంటూ ఉంటారు.. అయితే ఇలాంటి గ్యారెంటీ లేకుండా రుణం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందట.. విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా ఈ రుణాన్ని సైతం అందిస్తుందట. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను సైతం ఒకసారి మనం చూద్దాం.


సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ పౌరులకు ఎలాంటి హామీ లేకుండానే రూ .3 లక్షల రూపాయల వరకు రుణాన్ని సైతం అందిస్తుందట. విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా అతి తక్కువ వడ్డీకే రుణాలను సైతం అందిస్తుందట. గత ఏడాది విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని సైతం మొదలుపెట్టారు.. ఈ పథకంలో రుణ సౌకర్యంతో పాటు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారట. పలు వర్గాలకు చెందిన వారు ఈ రుణాన్ని సైతం తీసుకోవచ్చు. ఈ రుణాన్ని సైతం కమ్మరి గోల్డ్ వడ్రంగి తదితర టూల్ కి తయారీదారులు చెప్పులు కుట్టేవారు, చీపుర్లు తయారు చేసేవారు, బొమ్మలు తయారు చేసేవారు ఈ రుణాన్ని పొందవచ్చు.


ఈ పథకం ప్రయోజనం పొందాలి అంటే కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.. గుర్తింపు పొందిన సంస్థ నుంచి ట్రేడ్లో కూడా సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు ఈ పథకాన్ని పొందాలి అంటే ఈ పథకంలో ఉండేటువంటి 140 కులాలలో ఏదో ఒక కులానికి అర్హులు అయి ఉండాలి.. అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు కుల దృవీకరణ పత్రం బ్యాంకు పాస్బుక్ ఇతరత్రా వాటిని జోడించాలి.. ఈ పథకానికి అప్లై చేయాలనుకునేవారు అధికారికంగా వెబ్సైట్..pmvishwakarama.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి కౌశల్ సామాన్ యోజన కోసం దరఖాస్తు పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: