భారతీయ యువత పడకగదుల్లో పోస్టరుగా ఎన్ని లక్షల ఇళ్లలో ఆమె తిష్ట వేసి ఉన్నదో లెక్కచెప్పడం కష్టం. ఎన్ని లక్షల మంది కుర్రకారు కలల్లోకి చొరబడిపోయి వారికి ఆమె నిద్రలేని రాత్రులను ప్రసాదిస్తూ ఉన్నదో లెక్కతేల్చడం కూడా కష్టం. అలాంటి బాలీవుడ్ సెక్సిణి ప్రియాంకా చోప్రా.. ఆసియాలోని ముద్దుగుమ్మల్లోకెల్లా.. అత్యంత సెక్సీయెస్ట్ ఫిగర్‌గా ఫస్ట్‌ర్యాంక్ కొట్టేసింది. ఇలా ఫస్ట్‌ర్యాంక్ సాధించడం ప్రియాంకకు వరుసగా మూడోసారి. అంటే సెక్సీయెస్ట్ భామగా హ్యాట్రిక్ కొట్టేసిందన్నమాట.
లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే మేగజైన్ ఏటా నిర్వహించే ఆన్లైన్ పోల్‌లో ప్రియాంకకు ఆసియా వాసులు ఈ తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. ఆసియాలోని 50 మంది సెక్సీయెస్ట్ మహిళల మీద ఈ మేగజైన్ ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహించింది. నెటిజన్లు మాత్రం ప్రియాంకకే పట్టం కట్టారు. రెండోస్థానంలో టీవీ నటి సనయా ఇరానీ, మూడో స్థానంలో టీవీ స్టార్ ద్రష్ఠి ధామి దక్కించుకున్నారు.
బాలీవుడ్ స్టార్స్ దీపికా పడుకోనే, కత్రినాకైఫ్‌లు నాలుగైదు స్థానాల్లో సెటిలయ్యారు. మొత్తానికి ఆసియన్లలో అత్యంత సెక్సీయెస్ట్ ఫిగర్ లు కలిగి ఉన్న ముద్దుగుమ్మలు ఎక్కువ మంది భారతీయ సినిమా టీవీ రంగాలకు చెందిన వారే కావడాన్ని విశేషంగా చెప్పుకోవాల్సిందే.