పవర్ స్టార్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అంచనాలను అందుకోలేదు కాని సినిమా మాత్రం పవన్ ఫ్యాన్స్ కు నచ్చేసింది. అయితే త్రివిక్రం మార్క్ సినిమాలో ఎన్నో అదిరిపోయే మాటల తూటాలుంటాయి అవి ఈ సినిమాలో మిస్ అయ్యాయని కొందరు ఫీల్ అవుతున్నారు. అయితే అవి సందర్భోచితంగా రాబట్టి వాటిని గమనించలేదు ఏమో కాని త్రివిక్రం అజ్ఞాతవాసిలో కూడా తన పెన్ పవర్ ఏంటో చూపించాడు.
కుందేళ్లు అన్నీ కులాసాగా తిరుగుతున్నాయి, సింహం సరదాగా వచ్చేయొచ్చు.
ఒక ఆయుధం తయారు చెయ్యాలంటే ఒక చెయ్యి కావాలి.. ఒక ఆలోచన కావాలి.. ఒక స్వార్ధం కావాలి. కానీ విధ్వంసం రావాలంటే ఒక అన్యాయం జరగాలి.
నేను పెంచింది మాములు మనిషిని కాదు, ఒక యుద్ధం అంత విధ్వంసాన్ని, నడిచే మారణహోమాన్ని.
విచ్చలవిడిగా నరికితే హింస, విచక్షణతో నరికితే ధర్మం.
ఒకడికి ఆకలి వేస్తుంది అంటే ఎందుకు అని అడగరు, అదే అధికారం కావాలి అని అడిగితే ఎందుకు అని అడుగుతారు. ఎందుకు?
ఎప్పుడూ జరిగేదాన్ని అనుభవం అంటారు.. ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు.
మనుషులకు ఇంకొకడు సంపాదించిన డబ్బు అంటే ఎందుకు అంత ఆశ?
రాజ్యం మీద ఆశ లేని వాడికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు?
ఇన్ఫర్మేషన్ మొత్తం ఐఫోన్ లోను.. జీవితం మొత్తం గూగుల్ లో పెట్టేస్తున్నారు
చిన్న పిల్లలు ఆకలితో ఉన్నా.. ఆడపిల్లలు ఏడ్చినా ఈ దేశం బాగుపడదు.
విందా మీలాగే మాములు మనిషి.. కానీ అతని ఆశయం మాత్రం సాయంకాలం నీడ లాగా చాలా పెద్దది
ఎవడో వచ్చి విందా నాకు బాబు.. నేను విందాకి బాబు అంటే.. దా ఇందా కూర్చో అంటామా?
విమానం ఎక్కిన ప్రతివాడు ఎగురుతున్నాం అనుకుంటాడు. కానీ నిజానికి విమానం ఒక్కటే ఎగురుతుంది.. మనం కూర్చుంటాం అంతే. అలాగే ఈ ఏజ్ లో అన్నీ తెలుసు అనిపిస్తది, తెలవదు..! అనిపిస్తది అంతే.
మా నాన్న మూసిన తలుపులకు అవతల చనిపోయిన మీ అన్నయ్యనే చూస్తున్నావ్. ఆయన బ్రతికించిన కుటుంబాలని వెలిగించిన దీపాల్ని నువ్వు చూడట్లేదు, చూడలేదు, చూడలేవు.
ఇవి త్రివిక్రం అజ్ఞాతవాసిలో వాడిన డైలాగ్స్ ఇక ఇవే కాదు నువ్వు అనుకుంటే అడిగినట్టే.. అడిగితే అయిపోయినట్టే అమ్మా.. అంటూ ఇంకా మరెన్నో పవర్ ఫుల్ డైఇలాగ్స్ పవన్ కోసం అజ్ఞాతవాసి సినిమాలో రాశాడు త్రివిక్రం శ్రీనివాస్. సినిమా టాక్ బాగాలేదు కాబట్టి వీటి గురించి ఎవరు ప్రస్థావించట్లేదు.