కొన్ని రోజుల క్రితం దర్శకుడు మెహర్ రమేష్ పవన్ సినిమాను దర్శకత్వం వహించబోతున్నాడు అన్న వార్తలను విని షాక్ గురి అయిన పవర్ స్టార్ అభిమానులు ఆ తరువాత ఆ వార్త నిజం కాదని తెలియడంతో ఉపిరి పీల్చుకున్నారు. కాని ఆ ఆనందం పొంది ఎక్కువ రోజులు కూడా కాకుండానే నిన్న సాయంత్రం పవర్ స్టార్ అభిమానులు మరో మెగా షాక్ తిన్నారు. నిన్న సాయంత్రం భాగ్యనగరంలో జరిగిన సంతోషం పత్రిక 11వ అవార్డ్స్ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన పవన్ అభిమానులకు రచయిత చిన్నికృష్ణ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.

నిన్న జరిగిన అవార్డ్స్ నైట్ లో పాల్గొన్న చిన్నికృష్ణ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా తాను పవన్ కళ్యాణ్ కోసం తయారు చేస్తున్న అద్భుతమైన కధ గురించి ఎదురు చూస్తోందని, అందువల్ల తన తదుపరి సినిమా పవన్ కళ్యాణ్ సినిమాయే’ అంటూ ఆవేశంగా ప్రకటించిన రచయిత చిన్నికృష్ణ మాటలు విని పవన్ అభిమానులు ఖంగుతినడమే కాకుండా పవర్ స్టార్ చెయ్యబోయే సినిమాల లిస్టు లోకి చిన్నికృష్ణ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అంటూ కొద్ది నిమిషాల సేపు పవన్ అభిమానుల మైండ్స్ బ్లాంక్ అయ్యాయట. మెగా స్టార్ చిరంజీవి కి సూపర్ హిట్ ఇచ్చిన ‘ఇంద్ర’ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన చిన్నికృష్ణ, రెండు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ కు అదిరిపోయే హిట్ ఇస్తాను అంటూ ‘బద్రినాద్’ కధను ఇచ్చి చతికిల పడ్డాడు. అంతేకాకుండా ఆమధ్య మీడియా తో మాట్లాడుతూ, ఇంద్ర సినిమా అంత సూపర్ హిట్ కావడానికి చిరంజీవితో సమానంగా తన పాత్ర కూడా ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మెగా అభిమానుల కోపానికి గురి అయ్యాడు చిన్ని కృష్ణ.

అటువంటి చిన్నికృష్ణ మాయలో నిజంగానే పవర్ స్టార్ పడ్డాడా..? అనే తర్జనభర్జనలతో మెగా అభిమానులు నిన్న సంతోషం అవార్డ్స్ నైట్ లో అసహనంగా కాలం గడిపారని టాక్. క్రితం సంవత్సరం తెలుగు సినిమా ఇప్పటి వరకూ చూడని కనివినీ ఎరుగని కధ తన ‘జీనియస్’ సినిమా అంటూ మీడియా ముందు గొప్పలు చెప్పుకున్న చిన్ని కృష్ణ నిజంగానే పవన్ కు కధను రాస్తున్నాడా..? లేదంటే ఇది మీడియా ముందు తన గోప్పతనాన్ని బిల్డ్ అప్ చేసుకుంటున్నాడా..? అనే విషయం పై ఎటూ తెలియక పవన్ అభిమానులు టెన్షన్ తో నిన్న సంతోషం అవార్డ్స్ నైట్ లో సంతోషం లేకుండా కాలం గడిపారని ఫిల్మ్ నగర్ టాక్.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: