హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్న అఖిల్ తన నాల్గోవ సినిమాను మొదలు పెట్టడానికి కూడ భయపడిపోతున్నాడు అంటే ఈ అక్కినేని యంగ్ హీరోలో ఎలాంటి టెన్షన్ పెరిగిపోయిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం అఖిల్ తో సినిమాను తీయడానికి టాప్ దర్శకులకు ఎవరికీ ఖాళీ లేని పరిస్థుతులలో అఖిల్ తో సినిమా చేయడానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఎంతో ఉత్సాహం కనపరుస్తున్నాడు. 
Why Is This Happening To Akhil?
ఈసినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చినా ఈ సాహసం చేయడానికి అఖిల్ వెనకడుగు వేస్తూ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ పై ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ పరిస్థుతులలో భాస్కర్ అఖిల్ ని ఒప్పించడానికి కథలో అనేక మార్పులు చేస్తూ అక్కినేని కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. 
Inside Talk: First Half By Akhil, Second Half By Director
ఇలా ఈ విషయం కొనసాగుతూ ఉంటే అఖిల్ ను ఈ ప్రాజెక్ట్ లో ఒప్పించడానికి భాస్కర్ కియారా అద్వానికి తాను అఖిల్ తో తీయబోతున్న కథను చెప్పి ఆ మూవీ ప్రాజెక్ట్ కు అంగీకరించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే కియారాకు భాస్కర్ చెప్పిన కథ నచ్చడమే కాకుండా అరవింద్ బ్యానర్ లో నటించడం తనకు ఇష్టమే అయినా అఖిల్ పక్కన తాను హీరోయిన్ గా సరిపోనేమో అన్న సందేహాలు వ్యక్త పరిచినట్లు టాక్. 
Akhil-new-movie
దీనితో ఈకథ విషయంలో అఖిల్ కుదరకపోతే నాగచైతన్య చేత అయినా ఓకె అనిపించుకోవాలని భాస్కర్ తనవంతు ప్రయాతాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అఖిల్ భాస్కర్ చెప్పిన కథ నచ్చక టాప్ దర్శకులు ఎవ్వరు తనవైపు చూడక అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ ఉండి కూడ తన కెరియర్ కు ఒక మంచి బ్రేక్ ఇప్పించుకోలేక పోతున్నాను అన్న టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: