పవన్ అత్తారింటి తో తెలుగు సినిమా రంగానికి సెలెబ్రెటీ గా మారిపోయిన నదియాకు ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన తనకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురైంది అని చెప్పింది నదియా. తాను ‘అత్తారిల్లు’ థాంక్స్ గివింగ్ మీట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకోగానే విమానాశ్రయంలో ఉన్న ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు తనను చుట్టుముట్టి నప్పుడు తన వయస్సు పదేళ్ళు తగ్గిపోయి తాను హీరోయిన్ గా చేసిన రోజులు గుర్తుకు వచ్చాయని తాను ఇరవై ఏళ్ల క్రిందట కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తే ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ తనను ఒక గ్లామర్ క్వీన్ లా ఆరాధిస్తున్న ఆ యూత్ ను చూస్తే అనిపించిందని అంటోంది నదియా.

1994 లో సినిమా రంగానికి దూరం అయ్యాక 2004 లో సన్ ఆఫ్ మహాలక్ష్మి అనే తమిళ సినిమాలో నటించానని ఆ సినిమా రవితేజా హీరోగా నటించిన ‘ఈడియట్’ కు రీమేక్ అనీ అంటూ ఈ సినిమాతో మొదలైన తన సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో మొదటగా ‘మిర్చి’ తరువాత ‘అత్తారిల్లు’ సినిమాతో తన క్రేజ్ పెరగడం తన అదృష్టం అని చెపుతూ, తాను గతంలో తమిళ సినిమాలో నటించేడప్పుడు ఆరోజులలో హీరోయిన్స్ కు చూడేదార్లు, సల్వార్లు వాడటం తక్కువైనా ఆరోజుల్లోనే తను వేసుకున్న చుడేదార్లను నదియా డ్రస్సులు గా ఆనాటి అమ్మాయిలు వాడేవారనీ చెపుతోంది నదియా.

తాను ముస్లీం అయినా మరాఠీ హిందువు అయిన శిరీష్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని అంటూ తన అత్తవారింటి లో తనను సొంత కూతురిలా ఇప్పటికీ చూసుకుంటారని ‘అత్తారింటి’ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ సన్నివేశాలు వివరించినప్పుడు తనకు తన అత్తవారిల్లు గుర్తుకు రావడంతో తాను అంత సహజంగా చేయగలిగానని చెపుతోంది నదియా. మరొక ముఖ్య విషయం ఏమిటంటే పవన్ ‘అత్తారిల్లు’ ఇచ్చిన అదృష్టం తో కొత్త ఇంటికి యజమానురాలు అయ్యానని ఇదంతా తెలుగు ప్రేక్షకుల రుణమే అంటోంది ‘అత్తారిల్లు’ అత్త నదియా.

మరింత సమాచారం తెలుసుకోండి: