టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ... చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు.ఈ హీరో ఆటిట్యూడ్ మాటలతో అందరినీ మెస్మరైజ్ చేయగలరు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆ తరువాత గీత గోవిందం లో నటించి అందరినీ సర్ప్రైజ్ చేసి తనలోని నటుణ్ని నిరూపించుకున్నాడు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే ఓ రేంజిలో అంచనాలు పెరిగిపోతాయి.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించగా అది ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఆ సినిమా తర్వాత మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటించనున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాకు కూడా దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అటు విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే ఒక మంచి కథ నేపథ్యం ఉన్న సినిమా ఎంచుకుని తనలోని ఒక మంచి నటుడు ఉన్నాడు అని నిరూపించుకునే ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
అయితే ఈ ఇద్దరు ఒక్క స్క్రీన్ పై నటిస్తే చూడాలని ఏ తెలుగు ప్రేక్షకుడికి ఉండదు చెప్పండి. ఇది నిజమవ్వబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఓ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి . అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్నది పూరి జగన్నాథ్ సినిమానా లేక శివ నిర్వాణ సినిమానా అనేది మాత్రం క్లారిటీ లేదు. అటు ఆనంద్ దేవరకొండ మరో వైవిధ్యమైన కథను ఎంచుకొని ముందుకు వెళ్తున్న విషయం తెలిసింది. విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ఒక స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం అభిమానుల కోరిక తీరినట్లే అవుతుంది.